ఏపీలో కరోనా జోరు: మొత్తం కేసులు 11,63,994కి చేరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో18,972 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 11 లక్షల 63వేల 994 కి చేరుకొన్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో18,972 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 11 లక్షల 63వేల 994 కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో 71 మంది మరణించారు. తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో అత్యధికంగా 9మంది చొప్పున మరణించారు.అనంతపురం,కర్నూల్ జిల్లాల్లో ఏడుగురు చొప్పున చనిపోయారు.ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు, చిత్తూరులో ఐదురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఒకరు చనిపోయారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 8207కి చేరుకొంది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,67,18,148 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 35,732 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఏపీలో ఇప్పటివరకు10లక్షల 03 వేల 935 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇంకా 1,51,852 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.గత 24 గంటల్లో అనంతపురంలో 1158, చిత్తూరులో 1714,తూర్పుగోదావరిలో1914,గుంటూరులో 1194, కడపలో 969,కృష్ణాలో 990, కర్నూల్ లో 2628, నెల్లూరులో 1337,ప్రకాశంలో 1236, శ్రీకాకుళంలో 1732, విశాఖపట్టణంలో 1960, విజయనగరంలో 1052,పశ్చిమగోదావరిలో 1088కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు
అనంతపురం -86,875 మరణాలు 682
చిత్తూరు -1,26,811మరణాలు 994
తూర్పుగోదావరి -1,49,206, మరణాలు 718
గుంటూరు -1,10,247, మరణాలు 736
కడప -66023, మరణాలు 494
కృష్ణా -64,127,మరణాలు 785
కర్నూల్ -83,066, మరణాలు 564
నెల్లూరు -84,626,మరణాలు 624
ప్రకాశం -75,112,మరణాలు 646
శ్రీకాకుళం -74,575మరణాలు 409
విశాఖపట్టణం -85,024,మరణాలు 663
విజయనగరం -52,47 మరణాలు 308
పశ్చిమగోదావరి -1,02,960మరణాలు 584