Petrol and Diesel Rates : డిస్కౌంట్ సేల్ లా 5,10 కాదు.. దమ్ముంటే కేంద్రమే రూ.25 తగ్గించాలి.. పేర్ని నాని..

 ycp కేంద్ర కార్యాలయంలో సోమవారం నాని విలేకరులతో మాట్లాడారు. రూ. 70 రూపాయలు ఉండే డీజిల్, పెట్రోల్ ధర రూ.108, రూ. 117 వరకు తీసుకువెళ్లిన ఘనులు.. state governament ధర తగ్గించాలంటూ ఆందోళన చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల్లో దెబ్బపడగానే దిగొచ్చి నాటకాలాడుతున్నారు.

andhrapradesh not to reduce VAT on petrol and diesel says minister perni nani

అమరావతి :  పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాదని.. వాటిపై సెస్సుల రూపంలో లక్షల కోట్లు వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వమే మరింత తగ్గించాలని మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి డిమాండ్ చేశారు. భాజపా నాయకులకు నిజాయితీ, నిబద్ధత ఉంటే లీటరుపై ఐదు నుంచి పది రూపాయలు కాకుండా మరో 25 రూపాయలు తగ్గించాలని ప్రధాని మోదీని అడగాలని... అందుకోసం ఢిల్లీలోని నార్త్ బ్లాక్, పార్లమెంటు ముందు ధర్నా చేయాలని పేర్ని నాని సవాల్ విసిరారు

కావాలంటే తాను కూడా వస్తానన్నారు.  ycp కేంద్ర కార్యాలయంలో సోమవారం నాని విలేకరులతో మాట్లాడారు. రూ. 70 రూపాయలు ఉండే డీజిల్, పెట్రోల్ ధర రూ.108, రూ. 117 వరకు తీసుకువెళ్లిన ఘనులు.. state governament ధర తగ్గించాలంటూ ఆందోళన చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల్లో దెబ్బపడగానే దిగొచ్చి నాటకాలాడుతున్నారు.

గ్యాస్  పై  లాభం గడించడం లేదా?  రాష్ట్రంలో 2014 నుంచి Petrol, diesel పై 31శాతం VAT, అభివృద్ధి కార్యక్రమాలు, ఆర్థిక లోటు పూడ్చేందుకు రూ. 4 అదనపు సెస్సు, రహదారుల అభివృద్ధికి ఒక రూపాయి సెస్సు వసూలు చేస్తుంటే.. ధరలు తగ్గించాలంటూ ఇప్పుడు బీజేపీ నేతలు ధర్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే తగించింది. ఏటా సెస్సుల రూపంలో వసూలు చేస్తున్న రూ.2.87 లక్షల కోట్లలో పైసా తగ్గించలేదు.

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ల ఉపసంహరణ: నీలం సహానీకి బాబు ఫోన్

ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని Sessల పేరుతో భారం మోపుతోంది.’ అని perni nani ధ్వజమెత్తారు. వాస్తవాలు చెప్పేందుకు ప్రకటనలు ఇవ్వడం ప్రజాధనం దుర్వినియోగం అని ప్రశ్నించారు. రోడ్లకు మరమ్మతులు చేస్తే బాగుంటాయి. మేం అధికారంలోకి వచ్చిన ఏడాదికే రోడ్లు పాడయ్యాయంటే అర్థం ఏంటి?  టీడీపీ హయాంలో రహదారులు వేయకుండా డబ్బు తినేసి  ఉండాలి.  లేదా నాసిరకం వేసి ఉండాలి’  అని వ్యాఖ్యానించారు.

ఆదాయం మీకు.. భారం మాపైనా?
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వచ్చిన Incomeలో వాటా ఇవ్వకపోగా కోవిడ్ తో ఇబ్బంది పడుతున్న రాష్ట్రాల్ని ధరలు తగ్గించాలని కోరడం ఘోరమని ప్రభుత్వ సలహాదారుSajjala Ramakrishna Reddy ధ్వజమెత్తారు.  దాదాపు 90 శాతం పైగా ఆదాయం లో రాష్ట్రాలకు వాటా ఇవ్వలేదన్నారు. 

‘ ఇంధన ధరలు భారీగా పెంచి  డిస్కౌంట్ సేల్  మాదిరిగా రూ.5, రూ. 10  తగ్గించారు.  central governament పెట్రోల్, డీజిల్ పై రూ.3.35  లక్షల కోట్లు  పన్నుల ద్వారా వసూలు చేసింది.  Excise duty ద్వారా వచ్చిన రూ.47,500  కోట్ల ఆదాయాన్నే రాష్ట్రాలకు పంచింది.  మిగిలిన రూ.3.15  లక్షల కోట్లు కేంద్రం ఖాతాలోకే వెళ్లాయి. పెట్రోల్, డీజిల్  ధరల్ని మరింత తగ్గించాల్సిన బాధ్యత కేంద్రానిదే’  అని చెప్పారు.

వైసిపి  కేంద్ర కార్యాలయంలో సజ్జల సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలుపై వ్యాట్ తగ్గించాలంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విచిత్ర వాదన తెచ్చారు. అన్ని రాష్ట్రాలకు వ్యాట్ ద్వారా  రూ.2.21 లక్షల కోట్లు వచ్చిందన్నారు. 

కేంద్రానికి సెస్సుల  రూపంలో వచ్చినవి పెంచలేదని అడిగితే... రాష్ట్రాలకు వచ్చిన ఆదాయాన్ని చూపించడం తప్పుదోవ పట్టించడం కాదా?  రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో ధరలు తగ్గించాలని ధర్నాలు చేస్తామని చంద్రబాబు అంటున్నారు. ఇది టీడీపీ హయాంలో చేసిన పాపాలన్నీ కప్పిపుచ్చుకోవడానికి అని విమర్శించారు.

 ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి

 అన్ని పనులు జీఎస్టీ పరిధిలో ఉన్నందున రాష్ట్రాలకు  ఎక్సైజ్, పెట్రో ఉత్పత్తులపై పన్నులు మాత్రమే ఆదాయ వనరులుగా ఉన్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.  సోమవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నంత సులభంగా తాము నిర్ణయాలు తీసుకోలేమని చెప్పారు.  దీనిపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఒక ప్రశ్నకు బదులిచ్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios