కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో వైరస్ ని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం పలు ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.. ఆర్ఎంపీ డాక్టర్లకు వార్నింగ్ ఇచ్చారు.

Also Read ఏపీలో కరోనా కోరలు: కొత్తగా 21 కేసుల నమోదు, 402కు చేరిన సంఖ్య...

జలుబు, దగ్గు, జ్వరంతో వచ్చే వారికి ఆర్‌ఎంపీలు వైద్యం చేయొద్దని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆర్ఎంపీలకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.

‘ఆర్‌ఎంపీలు కరోనా లక్షణాలు వ్యక్తులకు వైద్యం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. కరోనా లక్షణాలున్న వ్యక్తుల సమాచారం స్థానిక వైద్య సిబ్బందికి ఇవ్వాలి. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాకూ ఒక కరోనా ఆస్పత్రి ఉంది. అందుబాటులో 4 రాష్ట్రస్థాయి కరోనా ఆస్పత్రులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేస్తున్న ఆర్ఎంపీలు ఎప్పటికప్పుడు స్థానిక వాలంటీర్లు, హెల్త్ వర్కర్లకు సమాచారమివ్వాలి. దగ్గర్లో ఉండే ప్రభుత్వాసుపత్రి వైద్యులకు సమాచారమివ్వాలి. ఉత్తర్వుల్ని ఉల్లంఘించే ఆర్‌ఎంపీలపై చర్యలు తీసుకుంటాం. వైరస్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటోంది’ అని వైద్య ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.