ప్ర‌జ‌ల కోసం త‌న జీవితాన్ని ధారాగా పోశారు. అంద‌రితోనూ ఆత్మీయంగా మేలుగ గ‌ల ఎకైక‌ వ్య‌క్తి వెంక‌య్య నాయుడు. ప్ర‌జ‌ల‌కు సేవ చేయ్య‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి .
విభజన సమయంలో ఏపీ తరుపున నిలబడిన ఏకైక వ్యక్తి వెంకయ్య నాయుడని అని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన రాజకీయాల్లో చేరిన నాటి నుండి ప్రజల కోసం తన జీవితాన్ని ధారాగా పోశారని ఈ రోజు విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌరసన్మాన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి అన్నారు. వెంకయ్యనాయుడిని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు.
అందరితోనూ ఆత్మీయంగా మేలుగ గల ఎకైక వ్యక్తి వెంకయ్య నాయుడు అని అంటూ నమ్మిన భావజాలం, సిద్దాంత వదలని మహోన్నత వ్యక్తి వెంకయ్య నాయుడు అని ఆయన పెర్కొన్నారు. ‘‘చాలా మంది డబ్బులు సంపాదిస్తారు, కానీ వాటిని ఉపయోగించే విధానం మాత్రం తెలియదు, వెంకయ్య నాయుడు తన సంపాదన అంతా స్వర్ణభారతీ ట్రస్టు ద్వారా ప్రజలకు సేవ చేస్తు లక్షలాదీ మంది మన్ననలు పొందుతున్నారు,’ అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలకు సేవ చేయ్యడంలో ఆయనకు ఆయనే సాటి అని ప్రశసిస్తూ అలాంటి వ్యక్తికి నేడు ఇక్కడ సన్మానం చెయ్యడం తమకి గర్వకారణమని అన్నారు.
వెంకయ్య నాయుడికి సుధీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నా ఒక్కటంటే ఒక్క మచ్చ లేదంటే అది ఆయన గొప్పతనమని చంద్రబాబు అభినంధించారు. బీజేపీ లో ఆయనను వరించని పదవి లేదని, బీజేపి అధ్యక్షుడిగా పని చేసిన ఘనత మన తెలుగు వాడైనా వెంకయ్య నాయుడికి దక్కడం ఆనాడు గొప్ప విషయమన్నారు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీషులో కూడా అనర్గలంగా మాట్లాడగల ఘనుడు వెంకయ్య నాయుడని కొనియాడారు. దక్షణ భారత రాజకీయాల నుండి ఉత్తర భారతానికి వెళ్లిన ఏ వ్యక్తి హింధీలో వెంకయ్యనాయుడిలా ఆనర్గళంగా మాట్లాడిన చరిత్ర లేదని తెలిపారు.
వెలగపూడిలో కేంద్ర ప్రభుత్వం నూతన ఇళ్లకు శంకుస్థాపన వేధిక పై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఏపీ ప్రభుత్వం పౌర సన్మాన కార్యక్రమం చేసింది.
అందులో ఉప రాష్ట్రపతితో పాటు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాద్, తదితర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గోన్నారు.
మరింత తాజా సమాచారం కోసం కింద క్లిక్ చెయ్యండి
