ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఒళ్లు గగుర్పాటుకు లోను చేసే  ఘటన జరిగింది. మొదటి భార్య ఇన్ స్టా రీల్స్ చూస్తున్నాడని రెండో భార్య.. భర్త మర్మాంగాన్ని కోసేసింది .

తనకు ఇష్టం లేకుండా ముద్దు పెట్టాడనే కారణంతో భర్త నాలుకను భార్య కోసేసిన ఘటన మరువకముందే మరో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మాంగం కోసేసింది భార్య. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని అయ్యప్ప నగర్ లో కలకలం రేపుతోంది. మొదటి భార్యను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతూ ఆమె రీల్స్ చూస్తున్నాడనే కోపంతో రెండో భార్య ఈ దారుణానికి పాల్పడింది.

వివరాల్లోకెళ్తే.. ముప్పాళ్ల గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబుకు గతంలో ఓ మహిళతో పెళ్లి అయింది. అయితే.. వారి మధ్య కలహాలు రావడంవతో విడిపోయారు. అయితే.. ఐదేళ్ల క్రితం ఆనంద్ బాబుకు మరో మహిళ వరమ్మ తో వివాహం జరిగింది. అయితే.. ఇటీవల ఆనంద్ బాబు బాగా సోషల్ మీడియాలో గడుపుతున్నడు. దీంతో అనుమానం వచ్చిన రెండో భార్య తన పై ఓ కన్నేసింది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఆనంద్ బాబు, ఇన్ స్టాగ్రామ్ లో తన మొదటి భార్య రీల్స్ , వీడియోలు చూస్తుండటం, ఆమెను ఇస్టాలో ఫాలో కూడా అవుతున్నాడు.

ఈ కమ్రంలో వరమ్మ.. ఆనంద్ బాబా గొడవపడింది. తనను పెళ్లి చేసుకుని.. ఇంకా మొదటి భార్యపై ఇష్టం తగ్గలేదా? ఆమె వీడియోలు ఎందుకు చూస్తున్నావ్? అసలు ఆమెను ఎందుకు ఫాలో అవుతున్నావ్? అని ఆనంద్ బాబుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇరువురి మధ్య మాటామాట పెరిగింది. ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. కోపంతో భర్త ఆనంద్ బాబుపై వరమ్మ బ్లేడ్‌తో దాడి చేసి మర్మాంగాలను వరమ్మ కోసేసింది. ఆనంద్ బాబుకు తీవ్ర రక్తస్రావం కావడంతో అతడిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అతడిని మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తీసుకెళ్లారు.