Asianet News TeluguAsianet News Telugu

ఆ విషయంలో జగన్ సర్కార్ దేశంలోనే టాప్.. మరో ఘనత సాధించిన ఏపీ..

ఆరోగ్య పథకాల అమలులో దేశంలోనే టాప్ లో నిలిచి జగన్ సర్కార్ అరుదైన ఘనతను దక్కించుకుంది. ఈ మేరకు జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) చేసిన పరిశీలనలో ఆరోగ్య పథకాల అమలులో ఏపీ ముందంజలో ఉందని తేలింది. 

Andhra Pradesh tops in implementation of health schemes in the state - bsb
Author
Hyderabad, First Published Jan 11, 2021, 2:32 PM IST

ఆరోగ్య పథకాల అమలులో దేశంలోనే టాప్ లో నిలిచి జగన్ సర్కార్ అరుదైన ఘనతను దక్కించుకుంది. ఈ మేరకు జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) చేసిన పరిశీలనలో ఆరోగ్య పథకాల అమలులో ఏపీ ముందంజలో ఉందని తేలింది. 

ఏపీతో గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు చాలా పథకాల్లో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడేవి. ఈ నేపత్యంలో ఇప్పుడు గుజరాత్‌ను రెండో స్థానానికి నెట్టి ఏపీ మొదటి స్థానానికి చేరిందని ఎన్‌హెచ్‌ఎం అధికార వర్గాలు తెలిపాయి. 

నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ) నియంత్రణకు జాతీయ ఆరోగ్యమిషన్‌ ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. దీంట్లో ఏపీ నంబర్‌ వన్‌గా నిలిచింది. మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్‌ వంటి వాటిని గుర్తించేందుకు ఐదు కోట్ల జనాభాకు సంబంధించి చేసిన ఇంటింటి సర్వేలో ఈ విసయం తేలింది.

ఇక మాతా శిశు మరణాల నియంత్రణ, కుటుంబ నియంత్రణల్లో కేరళ, తమిళనాడులు ముందంజలో ఉన్నాయి. కాగా గర్భిణుల ఆరోగ్యం, నవజాత శిశువుల సంరక్షణలాంటి ఆర్సీహెచ్‌ వంటి వాటిని ఎప్పటికప్పుడు కేంద్ర పరిధిలో పనిచేసే పోర్టల్‌కు అనుసంధానించే ప్రక్రియలో ఎక్కడో ఉన్న ఏపీ ఇప్పుడు మొదటి స్థానానికి వచ్చింది. 

రాష్ట్రంలో వైఎస్ఆర్ హెల్త్ క్లీనిక్స్ నిర్వహణలో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే 104 అంబులెన్సుల ద్వారా ప్రతి ఊరికి వెళ్లి ప్రాథమిక వైద్యం, మందులను ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మరింత మెరుగైనట్లు తేలింది.

రాష్ట్రంలో 10 వేలకు పైగా హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లు ఉండగా, వీటిలో 8,604 సెంటర్లకు కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగం కేంద్రాలకు మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌గా బీఎస్సీ నర్సింగ్‌ చదివిన వారిని నియమించారు.

ఇందులో ప్రధానంగా 12 రకాల సేవలను అందించడంలో గణనీయమైన వృద్ధి సాధించారు. దీనివల్ల లక్షలాది మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు పైస్థాయి ఆస్పత్రులకు వెళ్లాల్సిన భారం తప్పింది.

Follow Us:
Download App:
  • android
  • ios