ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కారుణ్య నియామకాలపై కీలక ప్రకటన చేసింది. మొత్తం 1800 పైచిలుకు కారుణ్య నియామకాలు చేపట్టడానికి సీఎం జగన్.. ఆయా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారని మంత్రి పేర్ని నాని చెప్పారు. కారుణ్య నియామకాలను ఆయా జిల్లాల్లోనే చేపడతామని వివరించారు. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేస్తామని మంత్రి పేర్ని నాని చెప్పారు. వారికి ఆయా జిల్లాల్లోనే ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే సీఎం జగన్ కారుణ్య నియామకాల గురించి కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చారని వివరించారు. త్వరలోనే కారుణ్య నియామకాలు చేపడతామని తెలిపారు. ఆర్టీసీతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగం కల్పిస్తామని వివరించారు. అలాగే, జిల్లా కలెక్టరేట్‌లోని సుమారు 40 శాఖలు, ఇతర రాష్ట్ర అన్ని శాఖల్లో అవసరమైన చోట్ల ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. 1800 పై చిలుకు కుటుంబాలకు చెందిన లబ్దిదారులకు నియామకాలు చేస్తామని చెప్పారు. ఇప్పటికే కారుణ్య నియామకాలకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఆయా జిల్లాల కలెక్టర్లు పంపించామని పేర్కొన్నారు. ఏ జిల్లాకు చెందిన ఆర్టీసి కార్మికులు మరణించి ఉన్నారో.. వారికి అదే జిల్లాలో ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్.. కలెక్టర్లు ఆదేశాలు పంపి ఉన్నారని వివరించారు.

ఆర్టీసీ బస్సుల కోసం బయట బంకుల నుంచే డీజిల్ కొనుగోలు చేస్తున్నామని ఇదే సమయంలో మంత్రి పేర్ని నాని అన్నారు. కేంద్రం ఇచ్చే ఆయిల్ ధర కంటే బయట బంకుల్లోనే రూ. 4 తక్కువగా ఉంటున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్లే ఆర్టీసికి నష్టాలు వస్తున్నాయని విమర్శించారు. దీని ద్వారా ఆర్టీసికి రూ. ఒక కోటిన్నర ఆదా చేకూరుతున్నదని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల టెండర్ ప్రక్రియ పూర్తయిందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. త్వరలోనే ప్రభుత్వానికి 40 ఎలక్ట్రిక్ బస్సులు అందనున్నాయని చెప్పారు.

60 ఏళ్లు పైబడిన ప్రయాణికులకు 25 శాతం రాయితీని ఏప్రిల్ 1 నుంచి పునరుద్ధరిస్తామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెలలోనే బ‌స్సు న‌డుపుతున్న స‌మ‌యంలో డ్రైవ‌ర్ కు గుండెపోటు వ‌చ్చిన ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. అయితే ఆయ‌న అప్ర‌మ‌త్త‌మై బ‌స్సును ఒక ప‌క్క‌కు తీసుకొచ్చి నిలిపివేసి ప్ర‌యాణికులు ప్రాణాలు కాపాడారు. కానీ కొంత స‌మ‌యానికే ఆయ‌న మృతి చెందాడు. ఈ విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ (APS RTC) కి చెందిన బ‌స్సు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం తిరుప‌తి (tirupathi) నుంచి పుంగ‌నూరు (punganuru) కు బ‌య‌లుదేరింది. ఈ స‌మ‌యంలో బ‌స్సులో 40 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. అయితే చిత్తూరు (chitturu) జిల్లా నాయుడుపేట (nayudupeta) పూత‌ల‌ప‌ట్టు (puthalapattu) జాతీయ రాహ‌దారి పైన అగ‌రాల గ్రామ స‌మీపంలోకి చేరుకునే స‌రికి డ్రైవ‌ర్ బి.ర‌వి (b.ravi) కి అక‌స్మాత్తుగా గుండెపోటు వ‌చ్చింది. దీంతో ఆయ‌న తీవ్ర అస్వస్థ‌త‌కు గుర‌య్యారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌యాణికుల‌కు ఏమీ కాకుడ‌ద‌నే ఉద్దేశంతో, స‌మ‌య‌స్పూర్తితో బ‌స్సును ఒక ప‌క్క‌కు తీసుకొచ్చి ఆపేశాడు. 

బ‌స్సులో ఉన్న ప్ర‌యాణికులు దీనిని గ‌మ‌నించి వెంటేనే అంబులెన్స్ కు సమాచారం అందించారు. దాని ద్వారా అత‌డిని స‌మీపంలోని హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు. కానీ ఆయ‌న అప్ప‌టికీ మృతి చెందార‌ని డాక్ట‌ర్లు నిర్ధారించారు.