Asianet News TeluguAsianet News Telugu

రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడోస్థానం..ఇదీ జగన్ సర్కార్ గొప్పతనం: కళా వెంకట్రావు

టీడీపీ హయాంలో అభివృద్ధికి నిలయంగా ఉన్న ఏపీ నేడు అప్పులకు, అరాచకాలకు కేరాఫ్  అడ్రస్ గా మారిందని టిడిపి నాయకులు కళా వెంకట్రావు ఆందోళన వ్యక్తం చేశారు. 

andhra pradesh third place in farmers suicides... kala venkat rao  akp
Author
Guntur, First Published Jun 2, 2021, 9:55 AM IST

గుంటూరు: దొంగను నమ్మి ఇంటి తాళాలిచ్చినట్లు జగన్ నమ్మి ప్రజలు అధికారం కట్టబెడితే 2 ఏళ్లలోనే రాష్ట్రాన్ని నాశనం చేశాడని టీడీపి పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళావెంకట్రావు ఆరోపించారు. రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడో స్థానంలో ఉందంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. టీడీపీ హయాంలో అభివృద్ధికి నిలయంగా ఉన్న ఏపీ నేడు అప్పులకు, అరాచకాలకు కేరాఫ్  అడ్రస్ గా మారిందని కళా ఆందోళన వ్యక్తం చేశారు. 

''అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన జగన్ అలాగే చేశారు. సి అంటే క్యాపిటల్, పి అంటే పోలవరం, యస్ అంటే స్పెషల్ స్టేటస్ ని  రద్దు చేశారు. ఇక రెండేళ్ళలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు, పేదలకు ఒక్క ఇల్లు కట్టలేదు కానీ అప్పు మాత్రం.రూ.1,65,932.21 కోట్లు చేశారు'' అని తెలిపారు. 

read more  వైసిపి నేతల దోపిడీపై విజిలెన్స్ విచారణ..: మాజీ మంత్రి ఆనంద్ బాబు డిమాండ్

''నిత్యావర ధరల నుంచి కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, వివిధ రూపాల్లో అనేక పన్నులు పెంచి రెండేళ్లలో ఒక్కో కుటుంబంపై రూ.2.50 లక్షల భారం మోపారు. 11.2 శాతం ఉన్న రాష్ట్ర వృద్ది రేటు వైసీపీ  రెండేళ్ల పాలనలో 3 శాతానికి పడిపోయింది'' అని తెలిపారు. 

''అధికారంలోకి రాగానే డీ.ఏ అమలు చేస్తా అంటే ఏంటో అనుకున్నారు. కానీ డీ అంటే డిమోలైజ్, ఏ అంటే అటాక్స్ అని ఇప్పుడు ప్రజలకు అర్ధమైంది. నవరత్నాల పేరుతో ప్రజలకు నవ నామాలు పెట్టారు. జగన్ రెడ్డి పాలనలో వైసీపీ నేతలు తప్ప ప్రజలెవరూ సంతోషంగా లేరు'' అని కళా వెంకట్రావు పేర్కొన్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios