ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 232 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 83వేల 082 కి చేరుకొన్నాయి.  

మరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 232 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 83వేల 082 కి చేరుకొన్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో నలుగురు మరణించారు. చిత్తూరు,గుంటూరు,విశాఖపట్టణం , పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరి చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,115కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,19,72,780 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 40,177 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 0232 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 72 వేల 897 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇంకా 3,070 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.


గత 24 గంటల్లో 017,చిత్తూరులో 056,తూర్పుగోదావరిలో 011, గుంటూరులో 027, కడపలో 004, కృష్ణాలో 040, కర్నూల్ లో 008, నెల్లూరులో 006, ప్రకాశంలో 004, శ్రీకాకుళంలో 005, విశాఖపట్టణంలో 020, విజయనగరంలో 003,పశ్చిమగోదావరిలో 031 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,391, మరణాలు 597
చిత్తూరు -86,304,మరణాలు 843
తూర్పుగోదావరి -1,23,766 మరణాలు 636
గుంటూరు -74,857, మరణాలు 666
కడప -55,028, మరణాలు 461
కృష్ణా -47,911,మరణాలు 666
కర్నూల్ -60,590, మరణాలు 487
నెల్లూరు -62,116, మరణాలు 505
ప్రకాశం -62,046, మరణాలు 579
శ్రీకాకుళం -45,968, మరణాలు 346
విశాఖపట్టణం -59,248, మరణాలు 552
విజయనగరం -41,038, మరణాలు 238
పశ్చిమగోదావరి -93,924, మరణాలు 539

Scroll to load tweet…