అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 998 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో  కరోనా కేసుల సంఖ్య 18697కి చేరుకొన్నాయి.

ఒక్క రోజులోనే విదేశాల నుండి వచ్చినవారిలో 36 మందికి, ఇతర రాష్ట్రాల నుండి వచ్చినవారిలో ఒక్కరికి కరోనా సోకింది. గత 24 గంటల్లో 20,567 మంది నుండి శాంపిల్స్ ను పరీక్షిస్తే 998 మందికి కరోనా సోకినట్టుగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 10,17,140 శాంపిల్స్ ను పరీక్షించారు. 

 

24 గంటల్లో 391 మంది కరోనా నుండి కోలుకొని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో 14 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 232 మంది మరణించారు.

రాష్ట్రంలోని కర్నూల్ లో అత్యధికంగా 2451 కేసులు  నమోదయ్యాయి. కర్నూల్ జిల్లా తర్వాతి స్థానంలో అనంతపురం జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 2186 కరోనా కేసులునమోదయ్యాయి. మూడో స్థానంలో గుంటూరు జిల్లా నిలిచింది. గుంటూరులో 1827 కేసులు నమోదయ్యాయి. నాలుగో స్థానంలో కృష్ణా జిల్లా నిలిచింది. కృష్ణా జిల్లాలో 1743 కేసులు నమోదైనట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.