ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో997 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 99వేల 812 కి చేరుకొన్నాయి.  

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో997 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 99వేల 812 కి చేరుకొన్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఐదుగురు మరణించారు.అనంతపురం, చిత్తూరు, కర్నూల్, నెల్లూరు, విశాఖపట్టణం జిల్లాల్లో కరోనాతో ఒక్కొక్కరు మరణించారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,210 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,50,21,364 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 31,325 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో997 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 282 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 96 వేల 498 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇంకా 6104 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 057, చిత్తూరులో 181,తూర్పుగోదావరిలో 028,గుంటూరులో 152, కడపలో 045,కృష్ణాలో 110, కర్నూల్ లో 082, నెల్లూరులో 084,,ప్రకాశంలో 041, శ్రీకాకుళంలో 061, విశాఖపట్టణంలో 139, విజయనగరంలో 004,పశ్చిమగోదావరిలో 013కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -68,307 మరణాలు 602
చిత్తూరు -89,507,మరణాలు 864
తూర్పుగోదావరి -1,25,281, మరణాలు 636
గుంటూరు -77,272, మరణాలు 675
కడప -55,738, మరణాలు 463
కృష్ణా -50,045,మరణాలు 684
కర్నూల్ -61,496, మరణాలు 494
నెల్లూరు -63,005,మరణాలు 510
ప్రకాశం -62,480, మరణాలు 582
శ్రీకాకుళం -46,629,మరణాలు 347
విశాఖపట్టణం -61,341,మరణాలు 573
విజయనగరం -41,313, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,513, మరణాలు 542

Scroll to load tweet…