ఏపీలో తగ్గని కరోనా జోరు: మొత్తం 5,67,123కి చేరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 9,536 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసులు 5లక్షల 67వేల123కి చేరుకొన్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 9,536 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసులు 5లక్షల 67వేల123కి చేరుకొన్నాయి.
గత 24 గంటల్లో 66 మంది కరోనాతో మరణించారు.అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురి చొప్పున కరోనాతో మరణించారు. కడప, విశాఖపట్టణంలలో ఆరుగురి చొప్పున చనిపోయారు. చిత్తూరు, తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూల్ లలో ఐదుగురి చొప్పున కోవిడ్ కారణంగా కన్నుమూశారు. గుంటూరు, విజయనగరంలలో నలుగురి చొప్పున చనిపోయారు. పశ్చిమగోదావరిలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరు 4,912 మంది మరణించారు.
ఏపీలో యాక్టివ్ కేసులు 95,072 ఉన్నాయి. కరోనా సోకిన వారిలో ఇప్పటివరకు 4 లక్షల 67వేల 139 మంది కోలుకొన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
గత 24 గంటల్లో అనంతపురంలో 521, చిత్తూరులో 957, తూర్పుగోదావరిలో 1414, గుంటూరులో 792, కడపలో 585, కృష్ణాలో 397, కర్నూల్ లో 441, నెల్లూరులో 844, ప్రకాశంలో 788, శ్రీకాకుళంలో 733, విశాఖపట్టణంలో 415, విజయనగరంలో 573, పశ్చిమగోదావరిలో 1076 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు
అనంతపురం -49,306, మరణాలు 407
చిత్తూరు -49,398, మరణాలు 525
తూర్పుగోదావరి -76,808, మరణాలు 454
గుంటూరు -45,538, మరణాలు 463
కడప -36,165, మరణాలు 306
కృష్ణా -21,274, మరణాలు 347
కర్నూల్ -51,625, మరణాలు 417
నెల్లూరు -43,374, మరణాలు 391
ప్రకాశం -36,442, మరణాలు 374
శ్రీకాకుళం -32,230, మరణాలు 286
విశాఖపట్టణం -43,848, మరణాలు 358
విజయనగరం -27,946, మరణాలు 196
పశ్చిమగోదావరి -50,474, మరణాలు 388