అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల్లో 58 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 1583 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

గత 24 గంటల్లో 6534 కరోనా శాంపిల్స్ ను పరీక్షిస్తే 58 కొత్త కేసులు నమోదైనట్టుగా ప్రభుత్వం స్పష్టం చేసింది.రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన మరణించిన వారి సంఖ్య ఇప్పటివరకు 33గా ఉన్నట్టుగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఖ్య 1062 మందిగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ వైరస్ సోకిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొంది 488 మంది డిశ్చార్జ్ అయ్యారని ఏపీ తెలిపింది.

 

గత 24 గంటల్లో కర్నూల్ జిల్లాలో 30 కేసులు నమోదయ్యాయి. కర్నూల్ తర్వాత గుంటూరు జిల్లాలో 11 కేసులు నమోదైనట్టుుగా ప్రభుత్వం ప్రకటించింది. అనంతపురంలో 7, చిత్తూరులో 1, కృష్ణాలో 8, నెల్లూరులో 1 కేసు నమోదైనట్టుగా సర్కార్ తెలిపింది.

రాష్ట్రంలో అత్యధిక కేసులు కర్నూల్ జిల్లాలోనే చోటు చేసుకొన్నాయి. కర్నూల్ లో అత్యధికంగా 466 కేసులు నమోదు కాగా, ఆ తర్వాతి స్థానంలో గుంటూరు నిలిచింది. గుంటూరులో 319 కేసులు నమోదయ్యాయి. మూడో స్థానంలో కృష్ణా జిల్లా నిలిచింది.ఈ జిల్లాలో 266 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది.

నెల్లూరులో 91 కేసులు, కడపలో 83,చిత్తూరులో 81,అనంతపురంలో 78, ప్రకాశంలో 61, పశ్చిమగోదావరిలో 59,తూర్పుగోదావరిలో 45, శ్రీకాకుళంలో 5 కేసులు నమోదయ్యాయి.