ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 520 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 74వేల 515 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 02 మంది కరోనాతో మరణించారు.కరోనాతో కృష్ణ, విశాఖపట్టణం జిల్లాల్లో ఒక్కరి చొప్పున  మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,049కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,06,99,622 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 64,425 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 0520 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 62వేల 230 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 5,236 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.


గత 24 గంటల్లో అనంతపురంలో 29,చిత్తూరులో 108,తూర్పుగోదావరిలో 059, గుంటూరులో 064, కడపలో09, కృష్ణాలో 071, కర్నూల్ లో 20, నెల్లూరులో 013, ప్రకాశంలో 21, శ్రీకాకుళంలో 011, విశాఖపట్టణంలో 034, విజయనగరంలో 012,పశ్చిమగోదావరిలో 069కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -66,972, మరణాలు 594
చిత్తూరు  -84,653,మరణాలు 834
తూర్పుగోదావరి -1,22,900, మరణాలు 636
గుంటూరు  -73,801, మరణాలు 655
కడప  -54,608, మరణాలు 453
కృష్ణా  -46,543,మరణాలు 653
కర్నూల్  -60,354, మరణాలు 487
నెల్లూరు -61,736, మరణాలు 501
ప్రకాశం -61,729, మరణాలు 578
శ్రీకాకుళం -45,671, మరణాలు 346
విశాఖపట్టణం  -58,595, మరణాలు 546
విజయనగరం  -40,832 మరణాలు 237
పశ్చిమగోదావరి -93,226, మరణాలు 529