Corona Cases in AP: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో నిన్నటి రోజుతో పోలిస్తే క‌రోనా కేసులు భారీగా తగ్గాయి. ఏపీలో గడచిన 24 గంటల్లో 25,284 నమూనాలను పరీక్షించగా... 5,879 మందికి వైరస్ పాజిటివ్ (Covid-19 Cases in AP)గా నిర్ధారణ అయింది. దీంతో మెుత్తం కేసుల సంఖ్య 22,76,370కు చేరింది.  

Corona Cases in AP: భార‌త్ లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్ర‌మంలో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో నిన్నటి రోజుతో పోలిస్తే క‌రోనా కేసులు భారీగా తగ్గాయి. గ‌త రెండు రోజుల క్రితం వ‌ర‌కు చాలా జిల్లాల్లో రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. కానీ, ఈ కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది.

ఏపీలో గడచిన 24 గంటల్లో 25,284 నమూనాలను పరీక్షించగా... 5,879 మందికి వైరస్ పాజిటివ్ (Cases in AP)గా నిర్ధారణ అయింది. దీంతో మెుత్తం కేసుల సంఖ్య 22,76,370కు చేరింది. ఇందులో అత్య‌ధికంగా అనంతపురంలో 856 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ త‌రువాత‌ తూర్పు గోదావరి జిల్లాలో 823, కడప జిల్లాలో 776, కృష్ణా జిల్లాలో 650 కేసులు న‌మోదయ్యాయి. ఇదే త‌రుణంలో అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 12 కేసులు న‌మోదయ్యాయి.

అదే సమయంలో 11,384 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 21,51,238కు చేరింది. రాష్ట్రంలో 11,0517 యాక్టివ్ కేసులు (Corona active cases) ఉన్నాయి. గ‌డిచిన 24 గంటల స‌మయంలో 9 మంది మరణించారు. ఈ తాజా మర‌ణాల‌తో కరోనా మృతుల సంఖ్య సంఖ్య 14,615కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,76,370 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 21,51,238 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,10,517 మందికి చికిత్స కొనసాగుతోంది.

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 2,09,918 క‌రోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 959 మంది మరణించారు. క‌రోనా వైరస్ నుంచి 2,62,628 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 15.77 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో 18,31,268 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 166.03 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేసిన‌ట్టు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.