Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు, కానీ తగ్గని మరణాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 4,872 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 17లక్షల 63 వేల 211కి చేరుకొన్నాయి.కరోనాతో ఒక్క రోజులోనే 86 మంది మరణించారు. 

andhra pradesh reports 4872 new corona cases, total rises to 17,63,211 lns
Author
Guntur, First Published Jun 7, 2021, 6:26 PM IST

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  గత 24 గంటల్లో కొత్తగా 4,872 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 17లక్షల 63 వేల 211కి చేరుకొన్నాయి.కరోనాతో ఒక్క రోజులోనే 86 మంది మరణించారు. గత 24 గంటల్లో అనంతపురంలో 535 చిత్తూరులో 961, తూర్పుగోదావరిలో810, గుంటూరులో374, కడపలో404, కృష్ణాలో175, కర్నూల్ లో212, నెల్లూరులో 232, ప్రకాశంలో 447,విశాఖపట్టణంలో 189, శ్రీకాకుళంలో166, విజయనగరంలో 207, పశ్చిమగోదావరిలో 160 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో86  మంది మరణించారు. చిత్తూరులో 13 మంది, గుంటూరులో 10 మంది, అనంతపురం,శ్రీకాకుళం జిల్లాల్లో 9 మంది చొప్పున మరణించారు. విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఏడుగురు చొప్పన చనిపోయారు.ప్రకాశం, విశాఖపట్టణం జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృత్యువాతపడ్డారు. తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూల్ జిల్లాల్లో ఐదుగురి చొప్పన చనిపోయారు. నెల్లూరులో నలుగురు చనిపోయారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రంలో 11,552మంది చనిపోయారు. 

గత 24 గంటల్లో 64,800  మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 4,872 మందికి కరోనా సోకినట్టుగా తేలింది. గత 24 గంటల్లో కరోనా నుండి 13,702 మంది కోలుకొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుండి  16,37,149కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు1,98,56,521 మంది నుండి శాంపిల్స్ సేకరించారు. ఇప్పటికి రాష్ట్రంలో 16,93,085 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,14,510 యాక్టివ్ కేసులున్నాయి. 

ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,45,195, మరణాలు 971
చిత్తూరు-2,01,329, మరణాలు1389
తూర్పుగోదావరి-2,39,512, మరణాలు 1012
గుంటూరు -1,54,344,మరణాలు 995
కడప -98,493 మరణాలు 564
కృష్ణా -93,055 ,మరణాలు 1010
కర్నూల్ - 1,18,034,మరణాలు 768
నెల్లూరు -1,21,446 మరణాలు 858
ప్రకాశం -1,11,625 మరణాలు 833
శ్రీకాకుళం-1,12,060, మరణాలు 630
విశాఖపట్టణం -1,42,031, మరణాలు 978
విజయనగరం -76,233, మరణాలు 609
పశ్చిమగోదావరి-1,46,959, మరణాలు 935


 

Follow Us:
Download App:
  • android
  • ios