అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1916 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 27 వేల 882కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 13 మంది కరోనా మరణించారు.కరోనాతో అనంతపురం, కృష్ణాలో ముగ్గురి చొప్పున మరణించారు. చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలలో ఒక్కొక్కరి చొప్పున చనిపోయారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,719 కి చేరుకొంది.


రాష్ట్రంలో ఇప్పటివరకు 81లక్షల 82వేల 266 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 64,581 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2618 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ఇప్పటివరకు 7 లక్షల 98 వేల 625 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 22,538 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 106,చిత్తూరులో 121 తూర్పుగోదావరిలో 354, గుంటూరులో 179, కడపలో141 కృష్ణాలో 068, కర్నూల్ లో 022 నెల్లూరులో 093, ప్రకాశంలో 178, శ్రీకాకుళంలో 068, విశాఖపట్టణంలో 105, విజయనగరంలో 055,పశ్చిమగోదావరిలో 426 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -64,835, మరణాలు 565
చిత్తూరు  -78,886,మరణాలు 785
తూర్పుగోదావరి -1,16,389 మరణాలు 613
గుంటూరు  -67,786 మరణాలు 622
కడప  -52,346 మరణాలు 440
కృష్ణా  -39,720 మరణాలు 573
కర్నూల్  -59,530 మరణాలు 482
నెల్లూరు -59,685 మరణాలు 486
ప్రకాశం -59,834 మరణాలు 572
శ్రీకాకుళం -44,095 మరణాలు 341
విశాఖపట్టణం  -56,001 మరణాలు 510
విజయనగరం  -39,429 మరణాలు 230
పశ్చిమగోదావరి -86,449 మరణాలు 500