అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1236  కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 57వేల 395 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 09 మంది కరోనా మరణించారు. కరోనాతో చిత్తూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరి చొప్పున చనిపోయారు. అనంతపురం,తూర్పుగోదావరి, గుంటూరులలో ఒక్కరి చొప్పున మరణించారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 6899కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 93లక్షల 33వేల 703మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.  గత 24 గంటల్లో 43,044 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.వీరిలో 1236మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో1,696 మందికి కరోనా నుండి కోలుకొన్నారు.

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 33వేల 980 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 16,516 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 49,చిత్తూరులో 157,తూర్పుగోదావరిలో 155, గుంటూరులో 181, కడపలో 060, కృష్ణాలో 194, కర్నూల్ లో 026, నెల్లూరులో 038, ప్రకాశంలో 024, శ్రీకాకుళంలో 051, విశాఖపట్టణంలో 053, విజయనగరంలో 028,పశ్చిమగోదావరిలో 220కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -66,284, మరణాలు 583
చిత్తూరు  -82,443,మరణాలు 814
తూర్పుగోదావరి -1,20,940, మరణాలు 628
గుంటూరు  -71,426, మరణాలు 640
కడప  -53,793,మరణాలు 446
కృష్ణా  -43,727, మరణాలు 615
కర్నూల్  -59,998, మరణాలు 483
నెల్లూరు -60,968, మరణాలు 491
ప్రకాశం -61,042, మరణాలు 576
శ్రీకాకుళం -45,132, మరణాలు 345
విశాఖపట్టణం  -57,448, మరణాలు 529
విజయనగరం  -40,358,మరణాలు 233
పశ్చిమగోదావరి -90,941, మరణాలు 516