ఏపీ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో  కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిన్న కొత్తగా 1002 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 20,03,342 కి చేరింది. కరోనాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూను కొనసాగిస్తోంది. 

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో47,972 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 1002మందికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కరోనా కేసులు 20,03,342 కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 12 మంది మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,735కి చేరింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

గడిచిన 24 గంటల్లో 1508మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 19 లక్షల 75వేల 448 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 14,159 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,61,39,934 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో011,చిత్తూరులో 113, తూర్పుగోదావరిలో265,గుంటూరులో064,కడపలో 132, కృష్ణాలో074, కర్నూల్ లో007, నెల్లూరులో118, ప్రకాశంలో 086,విశాఖపట్టణంలో 054,శ్రీకాకుళంలో019, విజయనగరంలో 035,పశ్చిమగోదావరిలో 024 కేసులు నమోదయ్యాయి.


గత 24 గంటల్లో కరోనాతో 12 మంది చనిపోయారు.చిత్తూరులో నలుగురు,కృష్ణాలో ముగ్గురు పశ్చిమగోదావరిలో ఇద్దరు కరోనాతో చనిపోయారు. తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కరి చొప్పున కరోనాతో మరణించారు..దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,735కి చేరుకొంది.


ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,56,947, మరణాలు 1091
చిత్తూరు-2,36,397, మరణాలు1817
తూర్పుగోదావరి-2,84184, మరణాలు 1248
గుంటూరు -1,71,533,మరణాలు 1175
కడప -1,12,060, మరణాలు 629
కృష్ణా -1,12,636,మరణాలు 1284
కర్నూల్ - 1,23,689,మరణాలు 845
నెల్లూరు -1,38,960,మరణాలు 988
ప్రకాశం -1,32,714, మరణాలు 1036
శ్రీకాకుళం-1,21,706, మరణాలు 773
విశాఖపట్టణం -1,54,382, మరణాలు 1101
విజయనగరం -82,130, మరణాలు 669
పశ్చిమగోదావరి-1,73,129, మరణాలు 1079

Scroll to load tweet…