ఏపీలో కరోనా జోరు: మొత్తం కేసులు 5,27,513కి చేరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 10,418 కరోనా కేసులు నమోదయ్యాయి., దీంతో రాష్ట్రంలో 5 లక్షల 27 వేల 513కి కరోనా కేసులు చేరుకొన్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 10,418 కరోనా కేసులు నమోదయ్యాయి., దీంతో రాష్ట్రంలో 5 లక్షల 27 వేల 513కి కరోనా కేసులు చేరుకొన్నాయి.
గత 24 గంటల్లో కరోనాతో 74 మంది మరణించారు. కడపలో 9 మంది, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్టణం జిల్లాల్లో ఏడుగురు కరోనాతో మరణించారు. అనంతపురం, చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆరుగురి చొప్పున కరోనాతో చనిపోయారు. కర్నూల్ , శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురి చొప్పున చనిపోయారు. విజయనగరంలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు మరణించారు. ఈ మరణాలతోరాష్ట్రంలో ఇప్పటివరకు 4,634 మంది మరణించారు.
గత 24 గంటల్లో అనంతపురంలో 801, చిత్తూరులో887, తూర్పుగోదావరిలో 1399, గుంటూరులో 707, కడపలో 785, కృష్ణాలో 350, కర్నూల్ లో 484, నెల్లూరులో 949, ప్రకాశంలో 1271, శ్రీకాకుళంలో 860, విశాఖపట్టణంలో 414, విజయనగరంలో 577, పశ్చిమ గోదావరిలో 1134 కొత్త కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు 43,06,762 మంది శాంపిల్స్ పరీక్షించారు. గత 24 గంటల్లో 9,942 మంది కరోనా నుండి కోలుకొన్నారు.
రాష్ట్రంలో 97,271 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుండి 4,25,607 మంది కోలుకొన్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కరోనా కేసులు, మరణాలు
అనంతపురం - 47,126, మరణాలు 385
చిత్తూరు - 45,501, మరణాలు495
తూర్పుగోదావరి - 71,085, మరణాలు 437
గుంటూరు - 42,309, మరణాలు 444
కడప - 33,514, మరణాలు 273
కృష్ణా - 19,414, మరణాలు 323
కర్నూల్ - 49,700, మరణాలు 406
నెల్లూరు - 40,218, మరణాలు 360
ప్రకాశం - 32,221, మరణాలు 344
శ్రీకాకుళం - 29,708, మరణాలు 275
విశాఖపట్టణం - 42,032, మరణాలు 337
విజయనగరం - 25,680, మరణాలు 184
పశ్చిమగోదావరి - 46,109, మరణాలు 371