అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో గత  24 గంటల్లో 10,175 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5 లక్షల 37 వేల 687కి చేరుకొంది. 

గత 24 గంటల్లో  అనంతపురంలో 422, చిత్తూరులో 968, తూర్పుగోదావరిలో 1412,గుంటూరు లో838, కడపలో 576,కృష్ణాలో545, కర్నూల్ లో 482, నెల్లూరులో823, ప్రకాశంలో1386, శ్రీకాకుళంలో 664, విశాఖపట్టణంలో 404, విజయనగరంలో 516, పశ్చిమగోదావరిలో 1139 కేసులు నమోదయ్యాయి.

కరోనా సోకి గత 24 గంటల్లో68 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో 4,702 మంది చనిపోయినట్టుగా ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనాతో చిత్తూరు, కడప, నెల్లూరులలో 9 మంది చొప్పున మరణించారు. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురి చొప్పున మరణించారు. అనంతపురంలో ఆరుగురు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరిలో ఐదుగురి చొప్పున మరణించారు. శ్రీకాకుళం, విశాఖపట్టణంలలో నలుగురి చొప్పున చనిపోయారు. గుంటూరులో ఇద్దరు, విజయనగరంలో ఒక్కరు మరణించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 97,338 యాక్టివ్ కేసులున్నాయి,. కరోనా సోకి  ఇప్పటివరకు 4 లక్షల 35 వేల 647 మంది కోలుకొన్నారు.

గత 24 గంటల్లో రాష్ట్రంలో 72,229 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 43 లక్షల 80 వేల 991 మంది నుండి శాంపిల్స్ సేకరించినట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం - 47,548, మరణాలు 391
చిత్తూరు - 46,469, మరణాలు 504
తూర్పు గోదావరి - 72,497, మరణాలు 442
గుంటూరు - 43,147, మరణాలు 446
కడప - 34,090, మరణాలు 282
కృష్ణా - 19,959, మరణాలు 330
కర్నూల్ - 50,182, మరణాలు 406
నెల్లూరు - 41,041, మరణాలు 369
ప్రకాశం - 33,607, మరణాలు 351
శ్రీకాకుళం- 30,607 మరణాలు 279
విశాఖపట్టణం - 42,436, మరణాలు 341
విజయనగరం - 26,196, మరణాలు 185
పశ్చిమగోదావరి-  47,248, మరణాలు 376