కత్తి మహేష్ ని ఏపీ నుంచి కూడా వెళ్లగొట్టారు

Andhra Pradesh: Police stop Kathi Mahesh press meet in Chittoor
Highlights

హైదరాబాద్ నుంచి 6నెలల పాటు బహిష్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఏపీలో కూడా ఆయన కారణంగా శాతి భద్రతలకు విఘాతం కలుగుతుందేమో అనే అనుమానంతో మహేష్ ని బెంగళూరుకు తరలించారు.

సినీ క్రిటిక్ కత్తి మహేష్ కి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇటీవలే ఆయనను హైదరాబాద్ నుంచి 6నెలల పాటు బహిష్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఏపీలో కూడా ఆయన కారణంగా శాతి భద్రతలకు విఘాతం కలుగుతుందేమో అనే అనుమానంతో మహేష్ ని బెంగళూరుకు తరలించారు.

పూర్తివివరాల్లోకి వెళితే...కత్తి మహేష్‌ ఇటీవల శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా హైదరాబాద్‌లో ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా మహేష్‌ను స్వస్థలమైన చిత్తూరు జిల్లా యల్లమందలో విడిచి పెట్టారు. 

మరోవైపు, పీలేరులో ఎంఆర్‌పీఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొనేందుకు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కోసం కార్యకర్తలు ఎదురుచూస్తుండగా కత్తి మహేష్‌ ప్రత్యక్షమయ్యారు. దీంతో పీలేరు ఇన్‌ఛార్జి సీఐలు తేజోమూర్తి, సోమశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం మదనపల్లె వైపు తీసుకెళ్లారు. అటునుంచి బెంగళూరుకు తీసుకెళ్లినట్లు సమాచారం. కత్తి మహేష్‌ ప్రెస్‌మీట్‌ పెడితే శాంతిభద్రతలు అదుపుతప్పుతాయనే ఉద్దేశంతో అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు.

loader