అమరావతి:మూదు రాజధానులకు మద్దతుగా కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. మూడు రాజధానుల వ్యవస్థతో ప్రాంతీయ సమానాభివృద్ధి సాధించాలని సీఎం జగన్ తీసుకొన్న నిర్ణయానికి అన్ని వర్గాల మద్దతు పెరుగుతోందని కానిస్టేబుల్ బసవరావు తెలిపారు.

గురువారంనాడు ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. అమరావతి పేరుతో గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతుల నుండి బలవంతంగా భూములను లాక్కొన్నందుకు గాను ఆయన 10 ఏళ్ల సర్వీసును వదులుకొన్నారు.

మంగళగిరి మండలం కురగల్లుకు చెందిన బసవరావ్ ప్రస్తుతం తెలంగాణలోని హైద్రాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హుమయున్ నగర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నారు.

విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూల్ లో జ్యూడీషీయల్ రాజధాని, అమరావతిలో శాసన రాజధానిని కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని అమరావతి పరిసర ప్రాంతానికి చెందిన రైతులు సుమారు 260 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.