ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో... వైసీపీ ప్రభంజనం సృష్టించింది. వైసీపీ నుంచి విజయ ఢంకా మోగించిన 25మందికి ముఖ్యమంత్రి జగన్... తన మంత్రి వర్గంలో చోటు కల్పించారు. ఇటీవల వారంతా ప్రమాణస్వీకారం కూడా చేశారు. మంత్రులుగా బాధ్యతలు  చేపట్టిన కేవలం రెండు రోజుల్లోనే... ఈ నూతన మంత్రులకు కొత్త చిక్కు వచ్చిపడింది.

సోషల్ మీడియా ఎఫెక్ట్..మంత్రులు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఇంతకీ మ్యాటరేంటంటే... మంత్రుల ఫోన్ నెంబర్లను ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది.... అభిమానులు అభినందనలు చెప్పడానికి విపరీతంగా ఫోన్స్ చేస్తున్నారు. ఒక కాల్ కట్ అవ్వడం ఆలస్యం... మరో కాల్ వస్తోందట. ఆ ఫోన్స్ ఎత్తలేక.. మాట్లాడలేక మంత్రులు ఇబ్బందిపడుతున్నారట. కొందరైతే ఏకంగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు సమాచారం.