అమరావతి: వచ్చే ఏడాది నవంబర్ 2న జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని ఏపీ హైకోర్టు గురువారం నాడు ఆదేశించింది.

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షల్లో చాలా తప్పులు వచ్చాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు  ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది.

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి  ఎపీపీఎస్‌సీ ఇటీవల కీ విడుదల చేసింది. ఇందులో 51 తప్పులు ఉన్నాయని పలువురు అభ్యర్ధులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే 51 తప్పులు లేవని ఏపీపీఎస్‌సీ తెలిపింది. కేవలం 25 తప్పులు మాత్రమే ఉన్నాయని కోర్టుకు ఏపీపీఎస్‌సీ తెలిపింది. 

ఏపీసీఎస్‌సీ కీ సవరించి విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది.గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలను మార్చి లో నిర్వహించాలని భావించారు. అయితే కరోనా కారణంగా పరీక్షలను వాయిదా వేశారు.

సివిల్స్ పరీక్షలు అక్టోబర్ మాసంలో నిర్వహించడంతో నవంబర్ లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకొంది.గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలో సబ్జెక్టు పేపర్లు ఒకటి నుండి నాలుగు వరకు రోజు విడిచి రోజు నిర్వహించనున్నారు. నవంబర్ ఐదు నుండి 13వ తేదీ లోపుగా ఈ పరీక్షలను పూర్తి చేయనున్నారు.