అమరావతి: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల చట్టబద్దతను న్యాయవాది వరలక్ష్మి హైకోర్టులో సవాల్ చేశారు. 

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వుల చట్టబద్దతను ఆమె ప్రశ్నించింది. ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారణకు బుధవారంనాడు స్వీకరించింది. 

also reaతమిళనాడు అధికారుల నిర్వాకం: చిత్తూరు సరిహద్దుల్లో రోడ్డుపై గొయ్యి,రాకపోకలు బంద్d:

ఈ పిటిషన్ పై ప్రభుత్వం తరపు న్యాయవాది సుమంత్ రెడ్డి స్పందించారు. ఈ విషయమై పారిశ్రామిక వేత్తలు న్యాయవాదులకు పిటిషన్ దాఖలు చేసే అవకాశం లేదని వాదించారు. ప్రజా ప్రయోజనం కూడ ఇమిడి ఉన్నందున వాదనలు విన్పించేందుకు కోర్టు అనుమతిస్తున్నట్టుగా ప్రకటించింది.

రాజ్యాంగానికి లోబడే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొందా అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఉత్తర్వులకు చట్టబద్దత ఉందా అని ప్రశ్నించింది.ఈ విషయమై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరుపున న్యాయవాది హైకోర్టును కోరారు.  నెల రోజుల్లోపుగా సమాధానం చెప్పాలని  హైకోర్టు ఆదేశించింది.

జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ ఉత్తర్వుల జారీపై కొన్ని పార్టీలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.