తమిళనాడు అధికారుల నిర్వాకం: చిత్తూరు సరిహద్దుల్లో రోడ్డుపై గొయ్యి,రాకపోకలు బంద్
తమిళనాడు రాష్ట్ర అధికారులు మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకొన్నారు. చిత్తూరు జిల్లా సరిహద్దులో రోడ్డుపై ఆరున్నర అడుగుల లోతు గుంతలు తవ్వారు. ఏపీ, తమిళనాడు మధ్య రాకపోకలు సాగకుండా ఉండేందుకు గుంతలు తవ్వారు. ఈ గుంతలను పూడ్చివేయాలని చిత్తూరు వాసులు డిమాండ్ చేస్తున్నారు.
చిత్తూరు: తమిళనాడు రాష్ట్ర అధికారులు మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకొన్నారు. చిత్తూరు జిల్లా సరిహద్దులో రోడ్డుపై ఆరున్నర అడుగుల లోతు గుంతలు తవ్వారు. ఏపీ, తమిళనాడు మధ్య రాకపోకలు సాగకుండా ఉండేందుకు గుంతలు తవ్వారు. ఈ గుంతలను పూడ్చివేయాలని చిత్తూరు వాసులు డిమాండ్ చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలోని హనుమంతపురం మండలం పిచ్చాటూరు గ్రామం వెలుపలే తమిళనాడు రాష్ట్ర సరిహద్దు ఉంటుంది. ఈ మండలానికి చెందిన ప్రజలు పక్క గ్రామాలకు వెళ్లాంటే తమిళనాడు రాష్ట్రానికి చెందిన గ్రామాల నుండి వెళ్తారు.
also read:ఏపీలో కరోనా ఉగ్రరూపం: కొత్తగా 60 పాజిటివ్ కేసులు, 1777కు చేరిన సంఖ్య
తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఏపీ నుండి తమిళనాడు రాష్ట్ర పరిధిలోకి రాకపోకలు సాగించకుండా ఉండేందుుకు వీలుగా ఈ గొయ్యిని తవ్వారు. హనుమంతపురం మండలవాసులు మండలంలోని ఇతర గ్రామాలకు వెళ్లాలంటే ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే సరిపోయేది. తమిళనాడు అధికారులు రోడ్డును ధ్వంసం చేయడంతో ఇతర గ్రామాలకు వెళ్లాంటే 50 కి.మీ దూరం ప్రయాణించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
గతంలో కూడ తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లా కలెక్టర్ పలమనేరు, తమిళనాడు మధ్య రోడ్డుపై గోడను అడ్డుగా కట్టించాడు. ఈ గోడను అడ్డుగా కట్టించడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. గోడ కట్టించిన విషయం తెలుసుకొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ వేలూరు కలెక్టర్ తో మాట్లాడారు. గోడ కట్టించిన ఒక్క రోజులోనే గోడను కూల్చివేశారు.