విజయవాడ: వచ్చే ఏడాది జనవరి మాసంలో  స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్ మంత్రులకు చెప్పారు. వచ్చే ఏడాది  జనవరి మాసంలో అమ్మఒడి కార్యక్రమాన్ని గతంలో ప్రకటించిన తేదీ కంటే ముందుగానే ప్రారంభిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

బుధవారం నాడు  ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది.ఈ సమావేశం తర్వాత రాజకీయ అంశాలపై కూడ సీఎం జగన్  మంత్రులతో  చర్చించారు.వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ నుండి కాకుండా జనవరి 9వ తేదీనే ప్రారంభించనున్నట్టుగా  సీఎం చెప్పారు. 

స్కూళ్లకు పిల్లలను పంపే విద్యార్ధులకు ప్రతి ఏటా రూ, 15 వేలను చెల్లించనున్నట్టుగా సీఎం జగన్ తెలిపారు. ఈ కార్యక్రమం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్నట్టుగా సీఎం జగన్ మంత్రులకు స్పష్టం చేశారని సమాచారం. స్థానిక ఎన్నికల సమరానికి సిద్దంగా ఉండాలని సీఎం జగన్  కోరారు.   ఈ నెలాఖరులోపుగా ఆలయ కమిటీలు, మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ కోరారు.

Also read:నీకే నోరు ఉందా.. మాకు లేదా: పవన్‌పై బొత్స సత్యనారాయణ ఫైర్

 సుదీర్ఘ కాలం నుంచి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సర్వీసుల్లో ఉన్న వారిని కదిలించిందన్న మంత్రులు కోరినట్లు సమాచారం. సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పిస్తూనే.. 50 శాతం రిజర్వేషన్లను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం నిర్ణయించారు.

ప్రభుత్వంపై అవినీతి ముద్ర ఎంత మాత్రం పడడానికి వీల్లేదని...ఆ విధంగా కార్పోరేషన్ విధివిదానాలు రూపొందించాలని సూచించారు.  రాష్ట్రంలో పొలిటికల్ కరెప్షన్ దాదాపు కంట్రోల్ అయిందని  జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలా పొలిటికల్ కరెప్షన్ తగ్గినా... అధికారుల స్థాయిలో మాత్రం అవినీతి ఎంతమాత్రం తగ్గలేదని పలువురు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

Also read:Pawan: జగన్మోహన్ రెడ్డి మట్టిలో కలిసిపోతారు: పవన్ కల్యాణ్ శాపనార్థాలు

ఈ కేబినెట్ సమావేశంలో ఇసుకను అక్రమంగా నిల్వ ఉంచినా, ఎక్కువ ధరకు విక్రయించినా జైలు శిక్షతో పాటు జరిమానా విధించేలా చట్ట సవరణకు సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకొంది.