Whatsapp governance: ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్, ఏంటీ విధానం? ఎలా పనిచేస్తుంది? లాభాలేంటీ
Whatsapp governance in Andhra Pradesh : ఏపీ ప్రభుత్వం గురువారం నుంచి రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పాలనలో డిజిటలైజేషన్‌ను పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంటి.? ఎలా ఉపయోగపడుతుంది.? అసలు దీని లక్ష్యం ఏంటన్న పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Whatsapp governance in Andhra Pradesh: పాలన వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్‌ను తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా ప్రజలు ప్రభుత్వ అధికారులతో సులభంగా కమ్యూనికేట్ అవ్వొచ్చు. స్మార్ట్‌ఫోన్‌తోనే వేగంగా సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం లభిస్తుంది. ఈ విధానం ద్వారా ప్రభుత్వం సుమారు 150కిపైగా సేవలను అందిస్తోంది. బస్సు టికెట్ బుకింగ్ నుంచి మొదలు ఆలయంలో దర్శన టికెట్ బుకింగ్ వరకు అన్ని రకాల సేవలను వాట్సాప్‌లోనే చేసుకోవచ్చు.
వాట్సాప్ గవర్నెన్స్ లక్ష్యాలు..
* ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగవంతంగా అందించవచ్చు.
* ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంచడంతో పాటు అవినీతిని తగ్గించవచ్చు.
* ప్రజలు వాట్సాప్ ద్వారా తమ ఫిర్యాదులను నేరుగా నివేదించవచ్చు. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా మార్చడం.
Whatsapp governanceఎలా పనిచేస్తుంది.?
ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల కోసం ప్రత్యేకంగా వాట్సాప్ ప్రత్యేక నెంబర్‌ను తీసుకొచ్చింది. ఇందుకోసం 9552300009 నెంబర్‌ను తీసుకొచ్చారు. దేశంలోనే తొలిసారి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందిస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఈ నెంబర్‌కు సందేశాలు పంపించడం ద్వారా సేవలను పొందడంతో పాటు, ఫిర్యాదులను కూడా చేసుకోవచ్చు. కొన్ని అత్యవసర సేవల కోసం ఆటోమేటెడ్ చాట్‌బాట్‌ను తీసుకొచ్చారు.
గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్‌లో భాగంగా ప్రజలు తమ ఫిర్యాదును నమోదు చేసి, దాని పరిష్కార స్థితిని ట్రాక్ చేయవచ్చు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, సబ్సిడీలు తదితర అంశాలపై సమాచారం పొందవచ్చు. రేషన్ కార్డు, ఆధార్ అప్‌డేట్, పింఛన్ దరఖాస్తు వంటి ప్రభుత్వ సేవలను వాట్సాప్‌లో పొందొచ్చు. పోలీసు, అగ్నిమాపక, వైద్య సేవలు వంటి అత్యవసర సేవలను పొందొచ్చు. ప్రజలకు 24/7 సదుపాయం లభిస్తుంది.
Whatsapp governance: ఏయే విభాగాల్లో ఎలాంటి సేవలు అందించనున్నారు.?
ప్రభుత్వ పథకాలు:
* రేషన్ కార్డు, పింఛన్, ఉపాధి హామీ, విద్యా సహాయం, ఆరోగ్య బీమా వంటి ప్రభుత్వ పథకాల వివరాలు తెలుసుకోవచ్చు.
* అప్లికేషన్ లింకులు, అర్హతలు, కావాల్సిన డాక్యుమెంట్స్ వంటి వివరాలను వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
* రైతులకు, విద్యార్థులకు, వృద్ధులకు, మహిళలకు ప్రత్యేకంగా అందిస్తున్న పథకాల సమాచారం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది.
అత్యవసర సేవలు:
* అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించేందుకు ప్రత్యేక వాట్సాప్ సపోర్ట్ ఉంటుంది.
* అంబులెన్స్ సేవలు, ఆసుపత్రుల సమాచారాన్ని వాట్సాప్‌లో పొందొచ్చు.
* అగ్నిప్రమాదాలు జరిగే సమయంలో ఫైర్ స్టేషన్‌కు సంబంధించిన వివరాలను క్షణంలో తెలుసుకోవచ్చు.
* మహిళల భద్రతలో భాగంగా దౌర్జన్యాలు, హింస, వేధింపులు వంటి సమస్యలకు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక సేవలను అందించారు.
పౌర సేవలు, డిజిటల్ సర్టిఫికేట్లు..
* జన్మ ధృవీకరణ (Birth Certificate)
* మరణ ధృవీకరణ (Death Certificate)
* ఆదాయ ధృవీకరణ (Income Certificate)
* నివాస ధృవీకరణ (Residence Certificate)
* కుల ధృవీకరణ (Caste Certificate)
* ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్లు & దరఖాస్తు లింకులు వంటివన్నీ వాట్సాప్ ద్వారానే పొందొచ్చు.
విద్యా, ఉపాధికి సంబంధించిన సమాచారం..
* స్కాలర్షిప్‌లు, విద్యార్థి రుణాలు, ఉపాధి హామీ కార్యక్రమాలకు వంటి సమాచారాలు పొందొచ్చు.
* ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్‌లు, అప్లికేషన్ లింకులు, అర్హత వివరాలు.
* స్కూల్స్ & కాలేజీల అడ్మిషన్ సమాచారం పొందొచ్చు.
రైతులకు సంబంధించిన సేవలు..
* పంట బీమా, రైతు భరోసా, వ్యవసాయ రుణాల వివరాలు.
* వాతావరణ అంచనాలు, రైతులకు ఉపయోగకరమైన సమాచారం.
* విత్తనాలు, ఎరువులు, సాగు పద్ధతులపై సూచనలు.
ట్రాన్స్‌పోర్ట్, ట్రాఫిక్ సేవలు..
* డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ స్టేటస్.
* రవాణా శాఖ సేవలు – వాహన రిజిస్ట్రేషన్, ఛలాన్ల వివరాలు.
* బస్సు షెడ్యూల్, రైలు, మెట్రో సమాచారం.
పన్నులు, ఫైనాన్స్ సంబంధిత సేవలు:
* ఆస్తి పన్ను చెల్లింపులు.
* ప్రభుత్వ రుణాల దరఖాస్తు సమాచారం.
* GST & ఇతర పన్నుల రిజిస్ట్రేషన్ వివరాలు.
మున్సిపల్ అండ్ పబ్లిక్ హెల్త్ సేవలు:
* పారిశుద్ధ్య సమస్యలు, మురుగునీటి పారుదలపై ఫిర్యాదులు.
* తాగునీటి సమస్యల నివేదిక.
* మెడికల్ క్యాంపులు, ఆరోగ్య సేవల సమాచారం.
పర్యాటక అండ్ కల్చరల్ సమాచారం:
* రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల సమాచారం.
* రిజర్వేషన్లు, టికెట్ బుకింగ్ వివరాలు.
* దేవాలయ దర్శన వివరాలు, టైం స్లాట్స్. దర్శన టికెట్ బుకింగ్స్ వంటి సేవలను అందిస్తారు.