అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో  ఈ నెల 26వ తేదీ నుండి స్కూళ్లలో ఆడ్మిషన్లు ప్రారంభించేందుకు సన్నాహలు చేస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్  5వ తేదీ నుండి పాఠశాలు ప్రారంభించేందుకు జగన్ సర్కార్ ప్లాన్ చేసింది.ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి జగన్ సర్కార్ లేఖ రాసింది.

ఈ నెల 27వ  తేదీ నుండి పాఠశాలల్లో ఆడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఆడ్మిషన్లు  చేసుకొనేందుకు అనుమతించింది ప్రభుత్వం.

ఆడ్మిషన్ల సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలకు రావాలి. 2020-21 విద్యా సంవత్సరానికి ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్ ను కూడ పాఠశాల విద్యా కమిషనర్ విడుదల చేశారు.ప్రతి ఉపాధ్యాయుడు తన గరగతి సంబంధించి విద్యార్థి వారీగా ప్రణాళికను రూపొందించుకోవాలని విద్యాశాఖ సూచించింది.

పాఠ్యాంశాలకు ఆన్ లైన్ లో బోధన చేపట్టాలి, కానీ ఆ బోధన ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్ లో సూచించిన పాఠ్య ప్రణాళికకు మాత్రమే పరిమితం కావాలని విద్యాశాఖ సూచించింది.

విద్యార్థులను మూడు విధాలుగా విభజించనున్నారు. ఆన్‌లైన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్న వారిని హైటెక్ గా రేడియో లేదా దూరదర్శన్ అందుబాటులో ఉన్న వారంతా లోటెక్ , కంప్యూటర్ గానీ మొబైల్ గానీ రేడియో గానీ అందుబాటులో లేని వారిని నోటెక్ గా విభజించారు.

గ్రామ, పట్టణాల్లో ఎటువంటి సమాచార ప్రసార కంప్యూటర్ సాధనాలు అందుబాటులో లేని వారిపై దృష్టి పెట్టే విధంగా టీచర్ ప్రణాళికలను తయారు చేస్తున్నారు.

ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో కూడ వారానికి ఒకసారి హాజరు కావాలని సూచించింది. ఎవరు ఏ రోజు స్కూల్ కు రావాలో ప్రధానోపాధ్యాయుడు ఉత్తర్వులివ్వాలని విద్యాశాఖ ఆదేశించింది. 

దీర్ఘకాలిక వ్యాధులతో సతమౌతున్న వారు కంటోన్మెంట్ జోన్లలో నివసిస్తున్న వారు, శారీర వైకల్యం కలిగినవారు కంటైన్మెంట్ జోన్లలో పాఠశాలలు ఉన్న ఉపాధాయులు హాజరు కావాల్సిన అవసరం లేదని విద్యాశాఖ తెలిపింది.

ప్రతి టీచర్ కనీసం 15 మంది తల్లిదండ్రులకు పోన్ చేసి వారి పిల్లలు చేపట్టాల్సిన విద్యా కార్యక్రమాలపై గురించి వివరించాలని సూచించారు.