అమరావతి: దీపావళి పర్వదినం తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు  నిర్వహించనున్నట్టుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది.

ఈ ఏడాది డిసెంబర్  14వ తేదీ లోపుగా  అసెంబ్లీ నిర్వహించాల్సిన పరిస్థితి అనివార్యంగా నెలకొంది. దీంతో దీపావళి తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది.

also read:నవంబర్‌లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు: వారం రోజుల నిర్వహించే అవకాశం

నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు.వీలైనన్ని ఎక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.ఈ ఏడాది జూన్ 16న ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.  ఈ నెల 5వ తేదీన కేబినెట్ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల గురించి నిర్ణయం తీసుకోనున్నారు. 

ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఏ అంశాలు లేవనెత్తినా కూడ సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉన్నామని ప్రభుత్వ చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.టీడీపీ నేతలు ప్రభుత్వంపై బురదచల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును టీడీపీ నాశనం చేసిందని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.