Asianet News TeluguAsianet News Telugu

నవంబర్‌లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు: వారం రోజుల నిర్వహించే అవకాశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 15వ తేదీ తర్వాత నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. నవంబర్ 4వ తేదీన నిర్వహించాలని తలపెట్టిన కేబినెట్ సమావేశాన్ని ఐదో తేదీకి వాయిదా వేసింది ప్రభుత్వం.

Andhra pradesh government plans to conduct AP Assembly sessions in november lns
Author
Amaravathi, First Published Oct 29, 2020, 5:17 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 15వ తేదీ తర్వాత నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. నవంబర్ 4వ తేదీన నిర్వహించాలని తలపెట్టిన కేబినెట్ సమావేశాన్ని ఐదో తేదీకి వాయిదా వేసింది ప్రభుత్వం.

వారం రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.అంతేకాదు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కేబినెట్ లో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలను పంపాలని ఆయా శాఖలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు.

నవంబర్ 2వ తేదీ లోపుగా ఆయా శాఖలు పంపాలని సీఎస్ సూచించారు. నవంబర్ లో శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు. వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.

ఈ ఏడాది జూన్ 16న ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. జూన్ 18వ  తేదీన బడ్జెట్ ను ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. నవంబర్ మాసంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios