అమరావతి: విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. విశాఖలోని కొపులుప్పాడు కొండపై  30 ఎకరాల భూమిని స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ కు బదలాయిస్తూ జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడు రాజధానుల దిశగా  వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాలను రద్దును సవాల్ చేస్తూ అమరావతి రైతులతో పాటు పలు సంఘాలు సుమారు 70 పిటిషన్లను దాఖలు చేశారు. ఈ చట్టాలపై స్టేటస్ ను వచ్చే నెల 21వ తేదీ వరకు స్టేటస్ కోను పొడిగించింది హైకోర్టు. ఈ మేరకు గురువారం నాడు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

also read:రాజధాని కేసులో షాక్: వైఎస్ జగన్ కు హైకోర్టు నోటీసులు, మంత్రులకు సైతం...

మరో వైపు స్టేటస్ కో ఉన్న సమయంలో కూడ విశాఖలో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం ప్రభుత్వం శంకుస్థాపన చేయడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తోందని
న్యూఢిల్లీకి చెందిన న్యాయవాది ఇవాళ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంతకంతో కౌంటర్ వేయాలని హైకోర్టు ఆదేశించింది.

ఈ ఆదేశాలు జారీ చేసిన గంట తర్వాత విశాఖలో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం కొపులుప్పాడు కొండపై గ్రేహౌండ్స్ కు చెందిన 30 ఎకరాల భూమిని జిల్లా కలెక్టర్ కు బదలాయిస్తూ ఇవాళ ఏపీ ప్రభుత్వం 1353 జీవో జారీ చేసింది. దీన్ని అత్యవసరంగా పరిగణించాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రవీణ్ ప్రకాష్ పేరుతో  ఈ జీవో జారీ అయింది.