అమరావతి: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో గురువారం నాడు ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా ఉన్న కలంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ చీప్ గా పనిచేశారు. ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని గత ఏడాది మే 30వ తేదీన జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

ఈ సస్పెన్షన్ ను నిరసిస్తూ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు ఆతడిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఈ ఏడాది మే 22వ తేదీన ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. క్యాట్ ఆర్డర్ ను పక్కన పెట్టి హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

also read:జగన్ సర్కార్ కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ: ఏబీ సస్పెన్షన్ ఎత్తివేత

హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ ఇవాళ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. 

1989 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలీస్ ఇంటలిజెన్స్ ప్రోటోకాల్స్ విధానాలను ఉద్దేశ్యపూర్వకంగా ఉల్లంఘించారని  జగన్ ప్రభుత్వం అతడిపై సస్పెండ్ చేసింది.