:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బార్లలో మద్యం విక్రయానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. బార్లలో మద్యం విక్రయాలు జరపవద్దని ఏపీ తేల్చి చెప్పింది.
రాష్ట్రంలో బార్లలో మద్యం విక్రయించకూడదని ప్రభుత్వం ఆదేశించడంతో వైన్స్ డీలర్ల అసోసియేషన్ ప్రభుత్వం ముందుకు కొత్త ప్రతిపాదనను తెచ్చింది.

బార్లలో ఉన్న మద్యాన్ని విక్రయించుకొనేందుకు అవకాశం ఇవ్వాలని కోరింది. దీనికి ఏపీ ప్రభుత్వం కూడ సానుకూలంగా స్పందించింది. సీల్డ్ మద్యం బాటిల్స్ ను మాత్రమే బార్లకు సమీపంలోని వైన్స్ షాపులో విక్రయించుకొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: జీహెచ్ఎంసీ పరిధిలో సగానికి తగ్గిన మద్యం విక్రయాలు

మరోవైపు బార్లలో బీర్లు కూడ ఉంటాయి. లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే రెండు మాసాలకు పైగా బీర్లు బార్లలోనే ఉన్నాయి. తయారు చేసిన ఆరు మాసాల్లోపుగానే బీర్లను ఉపయోగించాలి. ఆరు మాసాలు దాటిన బీర్లను వాడకూడదు.

మద్యంతో పాటు బీర్లను కూడ వైన్స్ షాపుల్లో విక్రయించుకొనేందుకు సర్కార్ సానుకూలంగా స్పందించింది.  అయితే బీర్లు, మద్యం బాటిల్స్‌ను హోల్ సేల్ రేట్లకే విక్రయించాలని ప్రభుత్వం కోరింది. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది.