Asianet News TeluguAsianet News Telugu

డ్రైవింగ్ రూల్స్ ఉల్లంఘిస్తే భారీగా ఫైన్ : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఏపీ రాష్ట్రంలో పదే పదే డ్రైవింగ్ రూల్స్ బ్రేక్ చేస్తే జరిమానాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
 

andhra pradesh government decides huge fines for driving rules violators lns
Author
Amaravathi, First Published Oct 21, 2020, 5:59 PM IST


అమరావతి:  ఏపీ రాష్ట్రంలో పదే పదే డ్రైవింగ్ రూల్స్ బ్రేక్ చేస్తే జరిమానాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

మోటార్ సైకిళ్లు, ఏడు సీటర్ల కార్ల వరకు ఒక కేటగిరి కిందకు తీసుకొచ్చారు. భారీ వాహనాలను మరో కేటగిరి కిందకు మార్చారు. ఈ మేరకు సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ  చేశారు.

వాహనాల చెకింగ్ విధులకు ఆటంకం కల్గిస్తే రూ. 750 ఫైన్  విధించనున్నారు. అంతేకాదు పోలీసులు అడిగిన సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తే రూ. 750 వసూలు చేస్తారు.డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేనివారికి వాహనం ఇస్తే రూ. 10 వేల ఫైన్ విధిస్తారు. 

వేగంగా బండి నడిపితే రూ. 1000 ఫైన్ వేస్తారు.సెల్ ఫోన్, ప్రమాదకర డ్రైవింగ్ కు రూ. 10 వేలు జరిమానా విధించనున్నారు. రేసింగ్ కు పాల్పడితే మొదటి సారి రూ. 5 వేలు, రెండోసారి రూ. 10 వేలు జరిమానా వసూలు చేస్తారు. 

రిజిస్ట్రేషన్, ఫిట్ నెస్ లేకపోతే మొదటిసారి రూ. 2 వేలు, రెండోసారి రూ. 5 వేలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు ఉత్వర్వులను జారీ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios