Elections 2024: అతి శక్తివంతమైన ఓటు అనే అస్త్రాన్ని బారతీయ పౌరుడు వినియోగించుకునే అవకాశం వచ్చింది. తనకు నచ్చిన నాయకున్ని ఎంచుకుని దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు ప్రతి పౌరుడు సిద్దంగా ఉన్నారు. అయితే.. ఈ జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.
Elections 2024: అతి శక్తివంతమైన ఓటు అనే అస్త్రాన్ని బారతీయ పౌరుడు వినియోగించుకునే అవకాశం వచ్చింది. తనకు నచ్చిన నాయకున్ని ఎంచుకుని దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణియించుకునేందుకు ప్రతి పౌరుడు సిద్దంగా ఉన్నారు. ఈ క్రమంలోనే అటు ఏపీలో, ఇటు తెలంగాణలో సోమవారం మే 13న పోలింగ్ జరగనుంది. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగగా ఇటు తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్వస్థలాలకు పయనమవుతున్నారు. ఈ క్రమంలోనే అధికారులు ఓటర్లకు అలర్ట్ జారీ చేశారు. ఓటు వేసే సమయంలో కొన్ని పనులను చేస్తే వారిని జులుకే పంపిస్తాం అటూ హెచ్చరిస్తున్నారు. మరి ఆ పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో సోమవారం, మే 13 న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో హైదరాబాద్ మహానగరంలో ఆంక్షలను అమలు చేశారు. అంతే కాదు కొన్ని నియమాలను ఓటు వేసే సమయంలో తూచా తప్పకుండా పాటించాలి హెచ్చరించారు. ఈ నియమాలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పోలింగ్ బూత్ వద్ద..
>> పోలింగ్ సమయంలో బూత్ పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
>> మద్యం సేవించి ఓటువేసేందుకు పోలింగ్ బూత్‌లోకి వెళ్లరాదు.
>> ఇతరుల ఓటును వేసి రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నించకూడదు.
>> పోలింగ్ సమయంలో బూత్ వద్ద ఎలాంటి పార్టీ ప్రచారాలు చేయకూడదు. అల్లర్లు చేయరాదు. .
>> ఎన్నికల అధికారుల విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రశాంతంగా ఓట్లు వేయాలి.
>> ఓటు వేసే అభ్యర్థులు పోలింగ్ బూత్ కి గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.
>> ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కి వెళ్లినప్పుడు లోపలికి కెమెరా, మొబైల్ లాంటి ఎలక్ట్రానిక గూడ్స్ తీసుకెళ్లకూడదు.
>> ఈ నిమయాలను ధిక్కరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
ఓటరు ఇలా చేస్తే నేరం..
>> పోలింగ్ జరిగే రోజున ప్రతి ఒక్క ఓటరు ఎన్నికల సంఘం నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి.
పోలింగ్ లో దొంగ ఓటు వేస్తే నేరం..
>> ఓటుకు నోటు తీసుకుని ఓటు వేయడం నేరం.
>> రిగ్గింగ్ చేయడం చట్టరీత్యా నేరం.
>> ఒక వ్యక్తి తనకు ఉన్న ఒక్క ఓటు మాత్రమే వేయాలి.
>> ఓటరు రెండు, మూడు ఓటు హక్కును వినియోగించుకుంటే ఆ ఆవ్యక్తి పై కఠిన చర్యలు తప్పవు.
>> ఓటరు లిస్ట్‌లో పేరున్న వ్యక్తి మాత్రమే ఆ ఓటును వినియోగించుకోవాలి.
>> ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉంటే ఒక్క చోట మాత్రమే తన ఓటును వేయాలి.
>> ఓటు వేసిన వెంటనే ఓటరు పోలింగ్ బూత్ నుంచి బయటకు రావాలి.
>> పోలింగ్ బూత్ సమీపంలో కావాలని ఎక్కువ సేపు నిలుచున్నా, ఇతర ఓటర్లకు ఆటంకం కలిగించిన చర్యలు తప్పవు. అలాగే పోలింగ్ బూత్ లోకి తీసుకెళ్లకూడదు.
>> పోలింగ్ బూత్ వరకు మొబైల్ తీసుకువెళ్లినా అప్పుడు దాన్ని స్విచ్ఛాఫ్ చేసి అధికారులకు ఇచ్చేయాలి.
>> ఓటు వేస్తూ ఫోటోలు దిగకూడదు.
>> ఏ పార్టీకి ఓటు వేశారో వెల్లడించకూడదు.
>> ఓటు వేస్తున్నప్పుడు ఫొటో, వీడియోలు ఎవరైనా తీస్తే పోలీసులకు సమాచారం అందించాలి.
>> డబ్బులు తీసుకుని ఎవరైనా ఓటు వేస్తే వారి పై చర్యలు తీసుకుంటారు.
