సామాజిక న్యాయాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లాలి: ఎమ్మెల్సీ అభ్యర్ధులతో జగన్

ఎమ్మెల్సీ అభ్యర్ధులతో  ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ సమావేశమయ్యారు.  రాష్ట్ర ప్రభుత్వం  చేస్తున్న కార్యక్రమాలను  ప్రజలకు  వివరించాలని ఆయన కోరారు.  

   Andhra Pradesh  CM YS Jagan meeting with  YCP MLC  Candidates  in Amaravathi

అమరావతి: మనం చేస్తున్న సామాజిక  న్యాయం ప్రతి గడపకు తెలియాల్సిన అవసరం ఉందని  ఏపీ  సీఎం వైఎస్ జగన్  చెప్పారు. 

ఎమ్మెల్సీ  అభ్యర్ధులతో  ఏపీ సీఎం  వైఎస్ జగన్ సోమవారం నాడు  తాడేపల్లిలోని  తన క్యాంప్  కార్యాలయంలో  సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా  ఆయన  ఎమ్మెల్సీ అభ్యర్ధులతో  మాట్లాడారు. ఎప్పుడూ  లేని విధంగా  సామాజిక న్యాయం చేస్తున్నామన్నారు.  ఇవాళ  ప్రకటించిన  18 మంది ఎమ్మెల్సీ అభ్యర్ధుల్లో  14 మంది  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలేనని  సీఎం జగన్ గుర్తు  చేశారు.  మిగిలిన నలుగురిలో  కూడా  ఒక్కో సామాజికవర్గానికి  చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారని  ఆయన  వివరించారు. పదవులు తీసుకున్నవారంతా  యాక్టివ్ గా  ఉండాలని   సీఎం జగన్ సూచించారు. 

లబ్దిదారులందరికీ  అవినీతికి తావులేకుండా  పథకాలను అందిస్తున్న విషయాన్ని  సీఎం  జగన్  గుర్తు  చేశారు. విద్య, ఆరోగ్యం,  వ్యవసాయం  వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్టుగా  సీఎం  చెప్పారు. 

also read:సామాజిక న్యాయానికి పెద్దపీట: ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ

రాష్ట్రంలో  ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.  మార్చి, మే మాసంలో  పలువురు ఎమ్మెల్సీలు  రిటైర్ కానున్నారు. దీంతో  ఎమ్మెల్సీ అభ్యర్ధులను వైసీపీ  ప్రకటించింది.  ఎమ్మెల్సీ  అభ్యర్ధుల ప్రకటనలో  సామాజిక న్యాయానికి  ఆ పార్టీ పెద్దపీట వేసింది. మంత్రివర్గంలో  కూడా  ఇదే  రకమైన పద్దతిని  ఆ పార్టీ  పాటించిన విషయం తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios