ప్రధాని మోదీ, పొరుగు రాష్ట్రం సీఎం సైతం...మరి జగన్ ఎందుకిలా: చంద్రబాబు ఆగ్రహం

టిడిపి సీనియర్లు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు, ప్రజా ప్రతినిధులతో ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

Andhra pradesh CM wear facemask in public: chandrababu

గుంటూరు: వైసిపి ప్రభుత్వ ఉదాసీనత వల్ల ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని...కేవలం 10రోజుల్లోనే రాష్ట్రంలో లక్ష కరోనా కేసులు నమోదయ్యాయని టిడిపి జాతీయాధ్యక్షులు చంద్రబాబు ఆరోపించారు. దేశంలో నమోదయ్యే కేసులలో 13% ఏపిలోనే వున్నాయన్నారు. డిశ్చార్జ్ అయ్యేవాళ్లకు రూ 2వేలు, మృతుల అంత్యక్రియలకు రూ15వేలు, ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వారియర్లకు రూ 50లక్షలను జగన్ ప్రభుత్వం ఇస్తానందని... కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరికి రూపాయి ఇవ్వలేదన్నారు. 

''ముఖ్యమంత్రి జగన్ మాస్క్ పెట్టుకోకపోవడం క్షమించరాని నేరం. దేశ ప్రధాని మోదీ, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం మాస్క్ ధరిస్తుంటే మన రాష్ట్రంలో సీఎం జగన్, మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం శోచనీయం'' అని మండిపడ్డారు.  

టిడిపి సీనియర్లు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు, ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ''మీటర్ల పేరుతో రైతుల మెడకు ఉరితాళ్లు తగిలించడం హేయం. 0.25% అప్పు పరిమితి కోసం 18లక్షల రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. వైసిపి ప్రభుత్వ దుర్మార్గాలను అడ్డుకుని రైతుల ప్రయోజనాలు కాపాడాలి'' అని సూచించారు. 

''ఏపిలో ఉన్న 19వేల మెగావాట్ల సామర్ధ్యంలో 15వేల మెగావాట్ల విద్యుత్ టిడిపి పెంచినదే. 4ఏళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపికి టాప్ ర్యాంక్ వస్తోంది.  టిడిపి పారిశ్రామిక విధానానికి గొప్ప రేటింగ్ లభించింది. కానీ వైసిపి నాయకులు పారిశ్రామిక వేత్తలను బెదిరించి, టెర్రరిజం ద్వారా రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చారు. కియాకు ఇచ్చే రాయితీలు వైసిపి దృష్టిలో పెనాల్టీనా..? కియా రావడం వైసిపికి ఇష్టం లేదు. వైసిపి బెదిరింపుల వల్లే కియా ఆగ్జిలరీ యూనిట్లు 17 వేరే రాష్ట్రాలకు తరలిపోయాయి''  అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

read more  ఇసుక, మద్యం అక్రమ రవాణా..ఎవరైనా సరే వదలొద్దు: అధికారులకు జగన్ ఆదేశం

''జగన్మోహన్ రెడ్డి సిఎం అయ్యాక ఏపిలో దళితులపై దాడులు జరగని రోజు లేదు. దళితుల ఇళ్లు తగులపెట్టడం, సజీవ దహనానికి యత్నం, శిరోముండనాలు, దళిత బిడ్డలపై గ్యాంగ్ రేప్ లు ఇలా వైసిపి అకృత్యాలకు లెక్కేలేదు. దళితులపై వైసిపి దమనకాండ గురించి దేశవ్యాప్తంగా ఎండగట్టాలి. ప్రతి జిల్లాలో వైసిపి బాధిత దళిత కుటుంబాలకు అండగా ఉండాలి'' అని టిడపి నాయకులకు చంద్రబాబు సూచించారు. 

''వైసిపి వచ్చాక దేవాలయాలపై దాడులు పెరిగిపోవడం బాధాకరం. టిడిపి హయాంలో రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడాం. ఎక్కడా ఎటువంటి దుర్ఘటనలు లేకుండా అన్ని మతాలను గౌరవించాం. వైసిపి వచ్చాక దేవాలయాల్లో, ప్రార్ధనా మందిరాల్లో అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి.  ఎక్కడికక్కడ మంత్రుల నిలదీతలే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. వైసిపి ప్రభుత్వ పథకాలన్నీ కొత్త సీసాలో పాత సారా వంటివే. టిడిపి ప్రభుత్వ పథకాలకు, తండ్రీ కొడుకుల పేర్లు తగిలిస్తున్నారు'' అని ఎద్దేవా చేశారు. 

''సంపూర్ణ పోషణ చేసేవాళ్లైతే అన్నా కేంటిన్లు మూత వేస్తారా..? రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక నిలిపేయడం సంపూర్ణ పోషణా..? గిరిజనుల ఫుడ్ బాస్కెట్ రద్దు సంపూర్ణ పోషణా..?
జగన్మోహన్ రెడ్డిని మించిన నాటకాల రాయుడు మరొకరు లేరు.నోరు తెరిస్తే అబద్దం, రోజుకో నాటకం, మాట తప్పడం, మడమ తిప్పడం..వైసిపి అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, అరాచకాలను ఎండగట్టాలి'' అని చంద్రబాబు పార్టీ నాయకులకు సూచించారు. 


  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios