ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు సీఎం వైఎస్ జగన్ శుభవార్త చెప్పారు. ర్షాలు, వరదలతోపాటు నేల కోత, ఇసుక మేటల కారణంగా పంటలు నష్టపోయి 5,97,311 మంది రైతన్నల ఖాతాల్లోకి రూ. 542.06 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని సీఎం జగన్ జమ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు సీఎం వైఎస్ జగన్ శుభవార్త చెప్పారు. పంట నష్టపోయిన రైతన్నల ఖాతాల్లోకి ప్రభుత్వం మంగళవారం ఇన్‌పుట్ సబ్సిడీని జమ చేసింది. వర్షాలు, వరదలతోపాటు నేల కోత, ఇసుక మేటల కారణంగా పంటలు నష్టపోయి 5,97,311 మంది రైతన్నల ఖాతాల్లోకి రూ. 542.06 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని సీఎం జగన్ జమ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ఒక్క బటన్ క్లిక్ తో రైతుల ఖాతాల్లోకి ఇన్ పుట్ సబ్సిడీ మొత్తాలను జమ చేశారు. అలాగే.. 1,220 రైతు గ్రూపుల ఖాతాల్లో వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద రూ. 29.51 కోట్లను కూడా జమ చేశారు.
ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతులకు అన్ని విధాలుగా తోడుగా, నీడగా నిలబడుతున్నామని చెప్పారు. 2021 నవంబర్‌లో వర్షాలు, వరదలకు పంట నష్టపోయారని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద సహాయం అందజేస్తున్నామని తెలిపారు. ఏ సీజన్‌లో నష్టపోయిన రైతులు అదే సీజన్‌లోనే పరిహారం అందజేస్తున్నామని తెలిపారు. నేల కోత, ఇసుక మేటల కారణంగా రైతులు నష్టపోయారని గుర్తుచేశారు. 5,97,311 మంది రైతులకు రూ. 542 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నామని వెల్లడించారు. 1,220 రైతు గ్రూపుకు వైఎస్సార్ యంత్ర సేవా కింద రూ. 29.51 కోట్ల లబ్ది చేకూరుతుందని తెలిపారు.
అన్ని రకాలు సహకార రంగాన్ని బలోపేతం దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పారు. ఈ రోజు రూ. 571 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని అన్నారు. గత ఖరీఫ్‌లో రూ. 1800 కోట్లు బీమా కింద ఇచ్చామని తెలిపారు. వివిధ కారణాలతో రూ. 93 కోట్లు ఇవ్వలేకపోయామని చెప్పారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి ఇవాళ ఆ రూ. 93 కోట్లు ఇస్తున్నామని వెల్లడించారు.
శాస్త్రీయంగా అర్హులెవరూ మిగిలిపోకుండా డేటాను ఆర్‌బీకే స్థాయిలో ప్రవేశపెట్టామని సీఎం జగన్ తెలిపారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సీడీ సరిగా ఇవ్వలేదని ఆరోపించారు. ఇచ్చినా కొద్దిమందికి మాత్రమే ఇచ్చారని విమర్శించారు. గత ప్రభుత్వం అనేక మంది రైతులకు సబ్సిడీ ఎగరగొట్టేసిందన్నారు.
