గుడ్ న్యూస్: డ్వాక్రా మహిళల ఖాతాల్లో నిధుల జమ, ఎంత పడిందో తెలుసా?
వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 79 లక్షల మంది డ్వాక్రా సంఘాల లబ్దిదారులకు సీఎం జగన్ ఇవాళ నిధులను విడుదల చేశారు.
ఉరవకొండ:వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 79 లక్షల మంది డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ. 6,395 కోట్లను సీఎం జగన్ విడుదల చేశారు.ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద లబ్దిదారులకు నిధులను విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు విడతలుగా డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాల్లో నిధులను విడుదల చేశారు సీఎం జగన్. ఇప్పటికే మూడు విడతలుగా రూ. 19,175.97 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఇవాళ నాలుగో విడత నిధులను జగన్ విడుదల చేశారు.
2019 ఏప్రిల్ 11 తేదీ నాటికి రాష్ట్రంలో 78,94,169 మంది పొదుపు మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,570.80 కోట్లు అప్పు ఉంది. ఈ అప్పులను విడతలుగా జగన్ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఇవాళ చివరి విడతగా రూ. రూ. 6,395 కోట్లను విడుదల చేసింది జగన్ ప్రభుత్వం.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వంగా సీఎం జగన్ చెప్పారు. మహిళలు బాగుంటే రాష్ట్రం కూడ ముందడుగు వైపు సాగుతుందన్నారు.జగనన్న అమ్మఒడి కింద రూ. 26,067 కోట్లు అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైఎస్ఆర్ ఆసరా కింద రూ. 25,571 కోట్ల రుణాలు చెల్లించినట్టుగా ఆయన వివరించారు. పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ కింద రూ. 4,968 కోట్లు చెల్లించామన్నారు.ఆసరా, సున్నా వడ్డీ కింద రూ. 31 వేల కోట్లు అందించినట్టుగా సీఎం వివరించారు.56 నెలల కాలంలో అక్కా చెల్లెళ్లకు రూ. 2.53 లక్షల కోట్లు అందించినట్టుగా సీఎం జగన్ గుర్తు చేశారు.
also read:రాష్ట్రాన్ని చీల్చిన పార్టీలో చంద్రబాబు అభిమానులు: షర్మిలపై జగన్ పరోక్ష విమర్శలు
ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఒక రికార్డు అని ఆయన చెప్పారు.గత ప్రభుత్వంలో దోచుకో, పంచుకో, తినుకో అనే విధానం సాగిందన్నారు. డ్వాక్రా సంఘాలను చంద్రబాబు మోసం చేశారని సీఎం జగన్ విమర్శించారు.చంద్రబాబు మోసాలతో సంఘాల గ్రేడ్లు పడిపోయాయన్నారు. కానీ, తమ ప్రభుత్వ హయంలో 56 నెలల కాలంలో డ్వాక్రా సంఘాల పరిస్థితి మెరుగైందన్నారు.