Asianet News TeluguAsianet News Telugu

మీ బ్యాంకు ఖాతాల్లోకి రూ. 10 వేలు: నిధులు విడుదల చేసిన జగన్

చిరు వ్యాపారులకు ఆర్ధిక సహాయం అందించే జగనన్న తోడు పథకం కింద నిధుల విడుదల కార్యక్రమాన్ని  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  నిరంతరాయంగా కొనసాగిస్తుంది.

 Andhra Pradesh Chief Minister Y.S. Jagan Mohan Reddy Releases jaganna thodu funds lns
Author
First Published Jan 11, 2024, 12:33 PM IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  గురువారం నాడు జగనన్న తోడు పథకం కింద నిధులను విడుదల చేశారు.  దరిమిలా  ఈ పథకం కింద లబ్దిదారులకు  రూ. 10వేలు  బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి.

మూడు లక్షల 95వేల మంది లబ్దిదారులకు  ఈ పథకం కింద నిధులను  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నిధులను విడుదల చేశారు.  ఈ పథకం కింద  చిరు వ్యాపారులు చేసే లబ్దిదారులకు  ప్రభుత్వం రూ. 10 వేలను జమ  చేస్తుంది.  రూ.431.58 కోట్ల నిధులను  ఇవాళ  లబ్దిదారుల ఖాతాల్లో  సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా  లబ్దిదారులతో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  వర్చువల్ గా ప్రసంగించారు. తమ ప్రభుత్వం  మానవత్వానికి మారుపేరుగా నిలుస్తుందన్నారు. జగనన్న తోడు పథకం కింద ఎనిమిది విడతలను విజయవంతంగా పూర్తి చేసినట్టుగా  సీఎం జగన్ చెప్పారు. 

also read:ముద్రగడ ఇంటికి ప్రధాన పార్టీల నేతల క్యూ: పద్మనాభం పయనమెటు?

చిరు వ్యాపారులకు ఈ పథకం భరోసాను కల్పిస్తుందని  ఆయన  చెప్పారు. ఈ రుణాలను సకాలంలో చెల్లించిన వారికి  వడ్డీలేని రుణాలను కూడ ప్రభుత్వం అందిస్తుందని ఆయన  చెప్పారు. చిరు వ్యాపారులకు  వడ్డీ రుణాల కింద రూ. 417 కోట్లు అందించినట్టుగా  సీఎం జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 16,73,576 మందికి  జగనన్న తోడు వడ్డీలేని రుణాలు అందించామన్నారు.జగనన్న తోడు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని  ఆయన  చెప్పారు.

also read:సంక్రాంతికి తెలుగు దేశం అభ్యర్థుల తొలి జాబితా: 25 మందికి చోటు

వాలంటీర్ల వ్యవస్థ ద్వారా  చిరు వ్యాపారులకు రుణాలు అందించడంతో పాటు రుణాలను సకాలంలో చెల్లించేలా చేసినట్టుగా ఆయన వివరించారు.  పీఎం స్వనిధి పేరుతో కేంద్ర ప్రభుత్వం  58,65,827 మందికి రుణాలు ఇచ్చిందని  సీఎం గుర్తు చేశారు.


జగనన్న తోడు పథకం ఎవరికి వర్తిస్తుంది

చిరు వ్యాపారులు, చేతివృత్తులకు రూ. 10 వేలను ఆర్ధిక సహాయం అందించడమే ఈ పథకం ఉద్దేశ్యం.రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు, మోటార్ బైకులు, సైకిళ్లపై వ్యాపారాలు చేసుకొనేవారు ఈ పథకం కింద  నిధులు పొందేందుకు అర్హులు.

also read:కళ్యాణదుర్గం నుండి పోటీ:కాంగ్రెస్‌లోకి కాపు రామచంద్రారెడ్డి?

సకాలంలో  ఈ రుణాలను చెల్లించినవారికి  ఏడాదికి అదనంగా వెయ్యి రూపాయాలను కలిపి  రుణంగా అందించనుంది ప్రభుత్వం. వడ్డీలేని రుణాల కింద  సకాలంలో రుణాలు చెల్లించిన వారికి ఇవాళ  రూ. 13 వేల చొప్పున  నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.  సకాలంలో  రుణాలు చెల్లించిన 15,87లక్షల మంది లబ్దిదారులకు  ప్రభుత్వం  రూ. 88.33 కోట్లను చెల్లించిందని సీఎం జగన్ వివరించారు.  దేశంలో ఏ రాష్ట్రం కూడ ఇంత పెద్ద మొత్తంలో నిధులను చెల్లించలేదని పేర్కొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios