ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు షాక్ తప్పదా !

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu in Controversy Over Alleged Phone Call
Highlights

కీలక ఆధారాలు లభ్యం

ఏపీ ముఖ్యమంత్రి,టిడీ పీ అధినేత నారా చంద్రబాబు ఓటుకు నోటు కేసు.. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే సోమవారం ప్రగతిభవన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో పోలీసు అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తెచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాదాపు రెండున్నర గంటలపాటు పోలీసు, న్యాయశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని ‘‘చట్టం ముందు అందరూ సమానులే. చట్ట ప్రకారం వ్యవహరించండి. మీపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండవు అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

శాసనమండలి ఎన్నికల్లో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు లంచం ఇస్తూ నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడం, అరెస్టు కావడం తెలిసిందే. స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇవ్వజూపడానికి ముందే చంద్రబాబునాయుడు ఆయనకు ఫోన్‌ చేసి టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు  అప్పట్లో ఈ ఆడియో సంచలనం రేపింది.

చంద్రబాబు మాట్లాడిన ఆడియోను ధ్రువీకరించుకునేందుకు ఏసీబీ రాష్ట్రంలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీకి కాకుండా చండీగఢ్‌లోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లో వాయిస్‌ను శాంపిల్‌ను పరీక్ష చేయించింది.  అధికారికంగా పరీక్షించిన వాయిస్‌ టెస్టులో అది చంద్రబాబు గొంతేనని  ధ్రువీకరించడంతో కేసులో కదలిక వచ్చింది.

అయితే ఫోరెన్సిక్ నివేదిక రావటంతో.. ఓటుకు నోటు కేసులో  చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు న్యాయనిపుణులు. ఈ కేసును గతంలో డీల్ చేసిన ఏసీబీ మాజీ డీజీ ఏకే ఖాన్ కూడా హాజరైనట్లు విశ్వసనీయ సమాచారం.

loader