ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి కసరత్తు పూర్తి కావొచ్చింది. ఆదివారం సీఎం వైఎస్ జగన్‌తో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి సమావేశమై మంత్రివర్గ కూర్పుపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి కసరత్తు పూర్తి అయింది. ఆదివారం సీఎం వైఎస్ జగన్‌తో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి సమావేశమై మంత్రివర్గ కూర్పుపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. మంత్రివర్గ జాబితాను సాయంత్రం తర్వాత విడుదల కానున్నట్టుగా చెప్పారు. రాజ్‌భవన్‌కు రాత్రి 7 గంటల తర్వాత రాజ్‌భవన్‌కు కేబినెట్ జాబితాను పంపనున్నట్టుగా తెలిపారు. ఇక, కొత్త మంత్రివర్గంలో పాతవారిలో 10 మందికి మళ్లీ అవకాశం కల్పించనున్నారనే ప్రచారం జరుగతుంది. అనుభవం, సామాజిక సమీకరణాలు, జిల్లాల అవసరాల దృష్ట్యా కొనసాగించే అవకాశం ఉంది. ఇక, కొత్తగా 15 మందిని తీసుకోనున్నారని తెలుస్తోంది.
మంత్రివర్గంలో చోటు దక్కిన వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వనున్నారు. సోమవారం ఉదయం 11.31 గంటలకు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం పక్కన ఏర్పాటు చేసిన వేదికపై మంత్రలు ప్రమాణ స్వీకారం జరగనుంది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత తేనీటి విందు ఉండనుంది.
విశాఖపట్టణం జిల్లాలో గుడివాడ అమర్ నాథ్ కు కేబినెట్ లో చోటు దక్కిందనే ప్రచారంతో ఆయన అభిమానులు అమర్ నాథ్ ఇంటి వద్ద అభిమానులు సందడి చేశారు. అయితే తనకు ఇంకా అధికారికంగా సమాచారం రాలేదని అమర్ నాథ్ చెప్పారు. సీఎం ఏ బాధ్యత అప్పగించినా కూడా తాను క్రమశిక్షణగా నిర్వహిస్తానని అమర్ నాథ్ చెప్పారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి కేబినెట్ లో బెర్త్ దక్కిందనే ప్రచారం కావడంతో గోవర్ధన్ రెడ్డి అభిమానులు ఆయనను సన్మానించారు. స్వీట్లు తినిపించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద సంబరాలు నిర్వహించారు. మరో వైపు శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి దక్కిందనే ఆయన అభిమానులు ఫ్లెక్సీలు కట్టారు.మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్న వారిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ప్రచారంలో ఉన్న వారి పేర్లు ఇవే..
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, గుమ్మనూరు జయరాం, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, అంజాద్ బాషా, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, రాజన్నదొర, ధర్మాన ప్రసాదరావు, అప్పలరాజు, భాగ్యలక్ష్మి, గుడివాడ అమర్‌నాథ్, దాడిశెట్టి రాజా, కొండెటి చిట్టి బాబు, కారుమూరి నాగేశ్వరరావు, గ్రంధి శ్రీనివాస్, జోగి రమేష్, కొడాలి నాని, రక్షణ నిధి, విడదల రజనీ, మేరుగ నాగార్జున, కాకాణి గోవర్దన్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాస్, శిల్పా చక్రపాణి రెడ్డి, గుమ్మనూరు జయరాం, జొన్నలగడ్డ పద్మావతి, శంకర్ నారాయణలకు మంత్రి వర్గంలో చోటు దక్కినట్టుగా ప్రచారం జరుగుతోంది.
