ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో మరోసారి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సమావేశమయ్యారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తుది దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో మరోసారి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సమావేశమయ్యారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. నేతల అభిప్రాయాలను సజ్జల రామకృష్ణారెడ్డి.. సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. కేబినెట్‌ బెర్త్‌పై ఆశావహుల నుంచి వస్తున్న అభ్యర్ధనలు, ప్రచారంలో ఉన్నవారి పేర్లపై వ్యక్తమవుతోన్న అభ్యంతరాలను సీఎం ముందు ఉంచనున్నారు. ఈరోజే సీఎం జగన్ కేబినెట్‌ లిస్ట్‌ను ఫైనల్ చేయనున్నారని సమాచారం. 

ఇక, ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయం గవర్నర్‌కు రెండు లేఖలు పంపనున్నట్టుగా తెలుస్తోంది. రాజీనామా చేసిన మంత్రుల వివరాలలో ఒక లేఖను.. కొత్త మంత్రుల వివరాలతో మరో లేఖను రాజ్ భవన్‌కు పంపనున్నారు. కేబినెట్‌లో బెర్త్ దక్కించుకున్నవారిని .. రేపు సమాచారం ఇవ్వనున్నారు. ఏప్రిల్ 11వ తేదీన మంత్రివర్గ ప్రమాణస్వీకారం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 

ఇక, శుక్రవారం సీఎం జగన్‌తో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సీఎం జగన్‌తో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ‌పై చర్చించలేదని సజ్జల తెలిపారు. సీఎం జగన్‌తో సమావేశం అనంతరం సజ్జల మాట్లాడుతూ.. సీఎంతో మంత్రి వర్గ విస్తరణపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ఇతర అంశాలపై చర్చించామన్నారు. మంత్రి వర్గంలో ఎవరు ఉండాలనేది పూర్తిగా సీఎం నిర్ణయం అన్నారు. అందులో ఎవరి ప్రమేయం ఉండదని, విస్తరణపై కసరత్తు కొనసాగుతోందని సజ్జల అన్నారు.

ఇక, ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రివర్గ కూర్పుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కసరత్తు ప్రారంభించారు. దీంతో ఆశావహుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సారి కేబినెట్‌లోకి ఎవరిని తీసుకుంటారనే విషయంలో సస్పెన్స్‌ కొనసాగుతోంది. 

ఈ నెల 7వ తేదీన Cabinet సమావేశంలోనే ministerతో రాజీనామాలు తీసుకున్నారు సీఎం జగన్.. 24 మంది నుండి రాజీనామా పత్రాలను సీఎం జగన్ తీసుకున్నారు. అయితే అనుభవం దృష్ట్యా ప్రస్తుతం ఉన్న సీనియర్లలో నలుగురైదుగురిని మంత్రివర్గంలో కొనసాగించనున్నట్టుగా సీఎం జగన్ చెప్పినట్టుగా తెలిసింది. అయితే నిన్న కేబినెట్ సమావేశం తర్వాత సీఎం జగన్ తన మనసు మార్చుకున్నారని ప్రచారం సాగుతుంది. Resignation చేసిన 24 మంది మంత్రుల్లో ఏడు నుండి 11 మంది మంత్రులను తిరిగి కేబినెట్ లోకి తీసుకొనే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ఇక, కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఏప్రిల్ 11వ తేదీన జరగనుంది.