Asianet News TeluguAsianet News Telugu

బారులుతీరిన ఓటర్లు... తొలి రెండుగంటల్లోనే తెలంగాణ, ఏపీలో రికార్డ్ పోలింగ్..!

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలోో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయ 7 గంటలకే పోలింగ్ ప్రారంభంకాగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుతీరారు. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల్లో మంచి పోలింగ్ శాతం నమోదయ్యింది...

Andhra Pradesh and Telangana Polling percentage till 9AM AKP
Author
First Published May 13, 2024, 9:56 AM IST

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.తెలంగాణ మాత్రం ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా పోలింగ్ సాగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభంకాగానే ప్రజలు, రాజకీయ  సినీ ప్రముఖులు ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపించారు. దీంతో తొలి రెండు గంటలు అంటే 9 గంటల వరకు మంచి పోలింగ్ శాతం నమోదయ్యింది. 

తెలంగాణ విషయానికి వస్తే ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు 9.5 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఇదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్ లో మరింత మెరుగ్గా 10 శాతానికి పైగా పోలింగ్ నమోదయినట్లు తెలుస్తోంది. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు భారీగా చేరుకున్న ఓటర్లతో క్యూలైన్ లో బారులు తీరారు. 

ఇక ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇక పవన్ కల్యాణ్ కూడా భార్యతో కలిసివెళ్లి మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి కాలనీలోని పోలింగ్ బూత్ లో ఓటేసారు. నారా లోకేష్, బ్రహ్మణి దంపతులు కూడా ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

హైదరాబాద్ లో సినీ ప్రముఖులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. చిరంజీవి, జూఎన్టీఆర్ దంపతులు ఓటేసారు. అల్లు అర్జున్ కూడా ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇక లోక్ సభ అభ్యర్థులు కిషన్ రెడ్డి, మధవీలత, అసదుద్దీన్ ఓవైసిలు కూడా ఇప్పటికే ఓటేసారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios