తిరుమల బ్రహ్మోత్సవాలు: శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం జగన్
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సోమవారం నాడు పట్టు వస్త్రాలను సమర్పించారు. రేపు కూడా పలు కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొంటారు.
తిరుపతి: tirumala శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఏపీ సీఎం ys jagan సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.
also read:తిరుపతిలో వైఎస్ జగన్: చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్ ప్రారంభించిన సీఎం
ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్ గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకొన్నారు. అక్కడి నుండి నేరుగా tirupati వచ్చారు. అలిపిరి వద్ద శ్రీవారి పాదాల వద్ద tirumalaకు నడక మార్గం పై కప్పును, గో మందిరాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.
అనంతరం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామిని దర్శనం చేసుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రభుత్వం తరఫున silk clothes సమర్పించారు.
స్వామివారి దర్శనం అనంతరం గరుడ వాహన సేవలో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఎస్వీబీసీ హిందీ, కన్నడ చానెల్స్ ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం కూడా పాల్గొంటారు. ఇండియా సిమెంట్స్ ఎన్ శ్రీనివాసన్ విరాళంతో నిర్మించిన రెండవ బూందీ మిశ్రమ కాంప్లెక్స్ ను ఆయన ప్రారంభించనున్నారు.