ఆనపర్తి: తనపై మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు చేశాడని అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి ప్రకటించారు. 
బుధవారం నాడు మధ్యాహ్నం బిక్కవోలు గణేష్ ఆలయంలో ప్రమాణం చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.తనపై మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని తాను దేవుడిపై ప్రమాణం చేశానని ఆయన చెప్పారు. 

also read:బిక్కవోలు గణేష్ ఆలయంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల ప్రమాణం: అనపర్తిలో టెన్షన్

తనతో పాటు తన భార్య కూడ ప్రమాణం చేసిందన్నారు. ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి ఉన్న సమయంంలో లిక్కర్ షాపులు, బెల్ట్ షాపుల నుండి రూ. 2 లక్షలు, మైనింగ్, లేఔవుట్ల నుండి ఎకరానికి రూ. 2 నుండి 5 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. చెరువుల నుండి నీరు చెట్టు పథకం కింద కోట్లు కొల్లగొట్టారని ఆయన గుర్తు చేశారు. 

ధాన్యం కొనుగోలులో క్వింటాల్ కు రూ. 15 వసూలు చేశారని ఆయన ఆరోపించారు.తాను చేసిన ఆరోపణలపై ప్రమాణం చేయాలని డిమాండ్ చేసిన తర్వాతే  నామమాత్రంగానే  ప్రమాణం చేశారని ఆయన ఆరోపించారు. తాను ప్రమాణం చేయాలని కోరితేనే ప్రమాణం చేశాడన్నారు. తనపై మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలను నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు.