కాకినాడ: బిక్కవోలు వినాయకుడి ఆలయంలో అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి దంపతులు బుధవారం నాడు ప్రమాణం చేశారు.

మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే  సూర్యనారాయణరెడ్డిపై పలు  ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆరోపణలపై వినాయకుడి విగ్రహం వద్ద ప్రమాణం చేస్తానని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ప్రకటించారు. 

also read:దేవుడి ముందు ప్రమాణాలకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సై: అనపర్తిలో టెన్షన్ వాతావరణం

తాను చేసిన ఆరోపణలను ఆధారాలతో నిరూపించేందుకు తాను సిద్దంగా ఉన్నానని ఆయన ప్రకటించారు ఎమ్మెల్యే. సూర్యనారాయణరెడ్డి తన భార్యతో కలిసి  మధ్యాహ్నం ఆలయానికి చేరుకొన్నారు.  ఇంటి నుండి  గణేషుడి చిత్ర పటంతో  ఎమ్మెల్యే దంపతులు కూడ వచ్చారు.

మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు కూడ అదే సమయానికి ఆలయానికి వచ్చారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ఈ ఆలయంలో ప్రమాణాలు చేశారు.

18 నెలల కాలంలో ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి అవినీతికి పాల్పడినట్టుగా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపించారు.ఈ ఆరోపణలపై నిరూపించాలని ఆయన సవాల్ విసారారు. ఈ విషయమై గణేష్ ఆలయంలో ప్రమాణానికి సిద్దమని  ఎమ్మెల్యే సవాల్ విసిరారు. తాను కూడా ప్రమాణం చేస్తానని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆలయంలో ప్రమాణం చేసే సమయంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. అయితే అక్కడే ఉన్న పోలీసులు ఇద్దరిని నిలువరించారు. తొలుత ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి ప్రమాణం చేశారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రమాణం చేశారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి భార్య ప్రమాణం చేయలేదని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపించారు.