వైసీపీ తీర్థం పుచ్చుకున్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే

anaparthi ex mla tetali rama reddy joins in ycp
Highlights

రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే వైసీపీ కండువా కప్పుకున్నారు.

మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలంతా.. ప్రస్తుతం వైసీపీవైపే ఎక్కువగా చూస్తున్నారు. రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే వైసీపీ కండువా కప్పుకున్నారు.

ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా..ఈ పాదయాత్రలో ఆయన సమక్షంలో అనపర్తది మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి పార్టీలో చేరారు.

ఆయనకు జగన్ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తేతలి రామారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి రాజ్యమేలుతుందని విమర్శించారు. మహానేత వైఎస్సార్‌ తనయుడు వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే మళ్లీ రాజన్న రాజ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ను సీఎంను చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే రామారెడ్డితో పాటు ఆయన అనుచరులు, పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు.

loader